E-Paper
Advertisement

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!
Advertisement

Redmi Projector 5 Pro: సినిమా థియేటర్‌లో పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసే మజానే వేరు. అయితే.. ఆ ఫీల్ మన ఇంట్లోనే పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి? సరిగ్గా.. ఇదే కలలను నిజం చేయడానికి ప్రముఖ టెక్ దిగ్గజం షియోమి అద్భుతమైన గ్యాడ్జెట్‌ను పరిచయం చేసింది. అదే ‘రెడ్మి ప్రాజెక్టర్ 5 ప్రో’. బెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీతో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టర్ మన హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెడ్మి ప్రాజెక్టర్ 5 ప్రో ఫీచర్లు:

అద్భుతమైన విజువల్స్, బ్రైట్‌నెస్:

ఈ కొత్త ప్రాజెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ దీని బ్రైట్‌నెస్ , పిక్చర్ క్వాలిటీ. ఇది 1000 CVIA లూమెన్స్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. దీని వల్ల పగటిపూట కూడా గదిలో.. స్పష్టమైన మూవీ చూడవచ్చు. రాత్రి సమయంలో అయితే.. ఇది అచ్చం సినిమా హాల్ ను తలపించేలా అద్భుతమైన కలర్ కాంట్రాస్ట్ , షార్ప్ నెస్‌ను అందిస్తుంది. పెద్ద పెద్ద స్క్రీన్లపై ఫేవరెట్ మూవీస్ చూసేవారికి ఇది ఒక చక్కటి ఫీల్ అందిస్తుంది.

గేమర్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్:

Advertisement

కేవలం సినిమాలు చూడటానికే కాకుండా.. గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని షియోమి దీన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రాజెక్టర్ 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. దీని వల్ల ప్లేస్టేషన్ లేదా ఎక్స్ బాక్స్ వంటి గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసి ఆడుతున్నప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా చాలా స్మూత్ గా గేమ్స్ రన్ అవుతాయి. పెద్ద స్క్రీన్ పై హై-స్పీడ్ గేమింగ్ ఇష్టపడేవారికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు, కనెక్టివిటీ:

ఇది కేవలం ఒక ప్రొజెక్టర్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్. ఇందులో.. ఆటో-ఫోకస్, ఆటోమేటిక్ కీస్టోన్ కరెక్షన్ వంటి లేటెస్ట్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. అంటే.. ప్రాజెక్టర్ ను ఎక్కడ పెట్టినా, అది తనంతట తానుగా గోడకు తగ్గట్టు స్క్రీన్ ను సెట్ చేసుకుంటుంది. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వివిధ రకాల పోర్ట్స్ ఉండటం వల్ల లాప్‌ టాప్, స్మార్ట్‌ ఫోన్ లేదా స్పీకర్లను క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మీ ఫోన్ డేటా సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? అయితే ఈ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ధర:

ఇంతటి అద్భుతమైన ఫీచర్లు కలిగిన షియోమి రెడ్మి ప్రాజెక్టర్ 5 ప్రో ధర విషయానికి వస్తే.. కంపెనీ దీన్ని అత్యంత తక్కువ ధరకే బడ్జెట్ లోనే లాంచ్ చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉండే అవకాశం ఉంది (చైనా మార్కెట్ ధరల ఆధారంగా). ఫీచర్లతో పోలిస్తే ఈ ధర చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. త్వరలోనే ఇది గ్లోబల్ మార్కెట్ తో పాటు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చిన్న చిన్న టీవీ స్క్రీన్లతో విసిగిపోయి..మీ ఇంట్లోనే ఒక సరి కొత్త సినిమా థియేటర్ ఫీల్ పొందాలనుకుంటే ‘రెడ్మి ప్రాజెక్టర్ 5 ప్రో’ ఒక అద్భుతమైన ఛాయిస్. మీ కుటుంబంతో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదించడానికి, వీకెండ్స్ లో పిల్లలతో కలిసి గేమింగ్ ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్!

Related News

మెుబైల్ పదే పదే స్లో అవుతూ చికాకు తెప్పిస్తోందా? పైసా ఖర్చు లేకుండా.. రాకెట్‌లా మార్చే 7 ట్రిక్స్!

Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

Big Stories

Advertisement
×