Big Stories

Smartphone Price Cut: దిమ్మతిరిగే డీల్.. iQOO 5G ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్!

iQOO Smartphone Price Cut: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తనస్మార్ట్‌ఫోన్ iQOO Z7 Pro 5Gని గతేడాది భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek  డైమెన్షన్ 7200 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 8 GB RAM ఉంది. రూ. 25 వేల కేటగిరిలో ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇది 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 66W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఫోన్ కేవలం 22 నిమిషాల్లో 1 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే తాజాగా కంపెనీ దీని ధరను తగ్గించి. స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. రెండు వేరియంట్లపై ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆగష్టు 2023లో మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. అందులో 8GB+128GB, 8GB+256GB వేరియంట్‌ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా చూసినట్లయితే రూ.23,999, రూ.24,999. స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లపై రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

- Advertisement -

Also Read: 200 MP కెమెరా.. అదిరిపోయిన రెడ్‌మీ కొత్త కలర్.. రూ.6 వేల డిస్కౌంట్!

ఈ ఆఫర్ల ద్వారా 128GB వెర్షన్‌ను రూ. 22,999కి దక్కించుకోవచ్చు. 256GB వెర్షన్‌ను రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ బ్లూ లగూన్, గ్రాఫైట్ మాట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. దీనితో పాటు, మీరు ఫోన్‌పై ICICI బ్యాంక్ కార్డ్‌పై రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందుతారు. స్మార్ట్‌ఫోన్‌తో 15 రోజుల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పాలసీ కూడా అందుబాటులో ఉంది. ఈ డీల్ అమోజాన్‌లో అందుబాటులో ఉంది.

iQOO Z7 Pro 5G Specifications
iQOO Z7 Pro 5G 3D కర్వ్డ్ సూపర్-విజన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 6.78 FHD+ స్క్రీన్‌‌తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 120 Hz. ఇది 1300 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బరువు 175 గ్రాములు. దాని మందం 7.36 మిమీ. ఇది MediaTek 7200 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 OSలో FuntouchOS 13 స్కిన్‌పై రన్ అవుతుంది.

Also Read: సూపర్ ఫీచర్స్.. ఐక్యూ నుంచి మొదటి బడ్జెట్ ఫోన్.. ఇది మామూలు రేటు కాదు!

iQOO Z7 Pro 5G 4600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కెమరా గురించి చెప్పాలంటే ఇది 64MP మెయిన్ బ్యాక్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంతా. ఈ ఫోన్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-సి కనెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News