Big Stories

Samsung Galaxy S22 5G Price Cut: మనసెలా వచ్చింది బ్రో.. భారీగా పడిపోయిన సామ్‌సంగ్ గెలాక్సీ S22 ధర.. మరీ ఇంత తక్కువ ధరకా..??

Offer Samsung Galaxy S22  5G Mobile: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మంచి డిస్కౌంట్‌తో తక్కువ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ గుడ్ న్యూస్. Samsung Galaxy S22 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో సామ్‌సంగ్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. Samsung Galaxy S22 5G ఫోన్ 2022లో మార్కెట్లో లాంచ్ అయింది. నేటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు దీని ధరపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

- Advertisement -

Samsung Galaxy S22 5G Offer

- Advertisement -

Samsung Galaxy S22 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 85,999 ఉండగా.. ఇప్పుడు 56 శాతం తగ్గింపుతో కేవలం రూ.36,999లకే లిస్ట్ అయింది. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ.49,000 భారీ డిస్కౌంట్ లభిస్తుందన్న మాట. అలాగే పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. Samsung Axis Bank Infinite Credit Cardపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

అలాగే Samsung Axis Bank Signature credit card కారుపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ బ్యాంక్ కార్డులు ఉన్న వారు ఫోన్‌ను మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.36,400 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ వర్తిస్తే Samsung Galaxy S22 5G ఫోన్‌ను తక్కువ ధరలోనే ఇంటికి పట్టుకురావచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. అయితే ఈ ఆఫర్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ ఆప్షన్‌కు వర్తిస్తుంది.

Also Read: 108MP కెమెరా ‘ఇన్‌ఫినిక్స్ నోట్ 40’ ఫోన్ సేల్ స్టార్ట్.. ఈ ఆఫర్లు భలేగున్నాయ్..!

Samsung Galaxy S22 5G Specifications

Samsung Galaxy S22 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డైనమిక్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేతో వినియోగదారులు గొప్ప అనుభవాన్ని పొందుతారు. ఇది 50MP + 12MP + 10MPతో బ్యాక్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. అలాగే సెల్ఫీల కోసం 10MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌ను అందించారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆదారపడి పనిచేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 3700 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News