Big Stories

Moto Edge 50 Ultra Vs Xiaomi 14 Civi: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది కింగ్..? మీ టేస్ట్‌కి తగ్గ ఫోన్ ఏదో తెలుసుకోండి..?

Motorola Edge 50 Ultra Vs Xiaomi 14 Civi: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. అలాంటి సమయంలో ఏ ఫోన్‌ కొనుక్కుంటే మంచిది అని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఇటీవల మోటోరోలా, షావోమీ కంపెనీలు తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మోటోరోలా ఎడ్జ్ 50 అల్రా, షావోమీ 14 సివిలను రిలీజ్ చేశాయి. ఈ రెండింటిలో ఏ ఫోన్ బెటర్, వాటి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ ఇలా అన్నింటిని పోల్చి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా VS షావోమీ 14 సివి

- Advertisement -

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అండ్ షావోమీ 14 సివి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 12జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే షావోమి 14 సివి 8జీబీ ర్యామ్ వేరియంట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8s gen 3ను కలిగి ఉంటాయి. ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కేవలం 512 స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే కలిగి ఉంది. అదే షావోమీ 14 సివి అయితే 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లను కూడా కలిగి ఉంది.

షావోమి 14 సివి కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50ఎంపీ వైడ్ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో లెన్స్‌తో పాటు లైకా ట్యూన్‌డ్ ట్రిపుల్ కెమెరాలను అందించారు.

Also Read: చెక్కతో చేసిన ఫోన్.. భారీ డిస్కౌంట్‌తో ఫస్ట్ సేల్.. చేతికి చిక్కితే ఉంటది!

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 64 ఎంపీ టెలిఫొటో లెన్స్ వంటివి ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఈ రెండు ఫోన్ల కెమెరా ఫీచర్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ షావోమీ 14సివిలో అదనంగా లైకా విజువల్ ఎఫెక్ట్స్ పొందొచ్చు. మంచి ఫొటోల ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అనుభూతిని అందిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ధర, బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఫోన్ అతి వేగంగా ఛార్జింగ్ ఎక్కేందుకు 125 వాట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10 వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్‌ని ఇందులో అమర్చారు. కాగా మోటోరోలాలో కేవలం ఒకే వేరియంట్ అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.54,999గా ఉంది.

Also Read: Mobile Offer: బంపర్ ఆఫర్.. వివో 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్!

షావోమి 14 సివి ధర, బ్యాటరీ విషయాలు.. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యటరీ ప్యాక్ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.42,999గా ఉంది. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,999గా నిర్ణయించారు. అందువల్ల మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారు.. ఈ రెండింటిలో కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి ఫీచర్లు సరిచూసుకుని కొనుక్కోవాల్సి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News