EPAPER

New Smartphone Launched: 200MP కెమెరా, 6000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్‌ లాంచ్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone Launched: 200MP కెమెరా, 6000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్‌ లాంచ్.. ఫీచర్లు కెవ్ కేక!

Meizu 21, Note 21, Note 21 Pro: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ భారతదేశంలో హవా చూపిస్తున్నాయి. అందులోనూ మన దేశంలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారు ఎక్కువైపోయారు. దీంతో రోజుకో కంపెనీ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చి హవా చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Meizu తన కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. అందులో Meizu 21, Meizu Note 21, Meizu Note 21 Proలను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది.


Meizu Note 21లో 90హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంటుంది. అదే సమయంలో Meizu Note 21 Proలో 120హెర్ట్జ్ డిస్‌ప్లే ఉంది. అయితే ఒక్క డిస్‌ప్లేలోనే కాదు. ఈ ఫోన్ల కెమెరాలలో కూడా తేడా ఉంది. Meizu 21 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED FHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వీటితో పాటు మరిన్ని ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Meizu 21, Note 21, Note 21 Pro


ఈ స్మార్ట్‌ఫోన్ల కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. నోట్ 21 ఫోన్ గల్ఫ్ బ్లూ, డైమండ్ బ్లాక్, ఐవరీ కలర్‌లలో వస్తుంది. అలాగే ప్రో మోడల్ బే బ్లూ, శాండ్‌స్టోన్, మార్బుల్ వంటి వేరియంట్‌లలో వస్తుంది. ఇక Meizu 21 ఫోన్ బ్లాక్, పర్పుల్, గ్రీన్, వైట్ షేడ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ వైడ్ ధరలను Meizu కంపెనీ వెల్లడించలేదు.

 Also Read: వారెవ్వా.. సామాన్యుల కోసం కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్, బోలెడన్ని ఫీచర్లు!

Meizu 21 Specifications

Meizu 21 ఫోన్‌లో 6.55 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చబడింది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ అమర్చారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ Android 14 ఆధారిత Flyme 10.5 OS పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అలాగే సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

అంతేకాకుండా ఫోన్‌‌లో సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఇది కాకుండా IR బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్లు కూడా ఇందులో అందించబడ్డాయి. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ ఇందులో IP54 రేటింగ్ ఫీచర్‌ను అందించింది. దీని ద్వారా తడిచేయితో స్క్రీన్ టచ్ చేసినా పనిచేస్తుంది.

Meizu Note 21 And Note 21 Pro Specifications

Meizu Note 21 అండ్ Note 21 Pro స్మార్ట్‌ఫోన్లు FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. నోట్ 21 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇక ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లు వరుసగా 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తాయి. Meizu Note 21ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.

అదే సమయంలో Meizu Note 21 Pro ఫోన్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. అలాగే నోట్ 21 ప్రో ఫోన్‌లో MediaTek Helio G99 చిప్‌సెట్ అందించారు. ఈ రెండు ఫోన్‌లు 8GB RAM + 256 GB స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. అయితే స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్‌కు మద్దతును కూడా అందించింది. నోట్ 21 ఫోన్ 18W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో నోట్ 21 ప్రో 30W ఛార్జింగ్‌కు మద్దతుతో 4950mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×