Animals: ప్రకృతి వైపరీత్యాలు అనగానే భూకంపం, సునామి, వరదలు, తుఫానులు వంటివే మనకు ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే, అవి వచ్చే ముందు చాలా రకాల జంతువులు వింతగా ప్రవర్తించడం మనం సినిమాల్లో, బయట చాలా సార్లు గమనించే ఉంటాం. జంతువులకు భవిష్యత్తులో రాబోయే ప్రకృతి వైపరీత్యాలను గుర్తించగల శక్తి ఉండడమే దీనికి కారణం అని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అన్న విషయాన్ని తెలుసుకుందాం.
ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగానే ఎలా గుర్తిస్తున్నాయనే ప్రశ్న సైంటిస్టులు, పరిశోధకులు, సామాన్య ప్రజలకు ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి సహజ విపత్తులు వచ్చే ముందు జంతువులు వింతగా బిహేవ్ చేసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఈ బిహేవియర్ వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా లేక ఇవి కేవలం అపోహలు మాత్రమేనా అనే విషయాన్ని తెలుసుకుందాం.
జంతువులు మానవుల కంటే చాలా సున్నితమైన ఇంద్రియాలను కలిగి ఉంటాయి. కుక్కలు, పిల్లులు వంటివి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను మాత్రమే వినగలిగితే, ఏనుగులు భూమి కంపనలను గుర్తించే పవర్‌ను కలిగి ఉంటాయి. పక్షులు వాతావరణంలో జరిగే చిన్న చిన్న మార్పులను, గాలి ఒత్తిడి పెరగడం, తగ్గడం వంటివి గ్రహిస్తాయి. 2004 సునామీ సమయంలో, శ్రీలంక, థాయిలాండ్‌లో చాలా జంతువులు భవిష్యత్తులో రాబోయే సునామీ నుండి వాటిని అవి రక్షించుకోవడానికి సురక్షితమైన ప్రాంతాలకు చేరుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు జంతువుల సహజ ప్రవర్తన అవి ఇచ్చే రియాక్షన్స్ విపత్తులను సూచిస్తాయనే నమ్మకం మరింత బలపడేలా చేస్తున్నాయి.
ALSO READ: పాములు నిజంగా పగబెట్టుకొని వేటాడి చంపుతాయా?
సైన్స్ పరంగా ఆలోచిస్తే, జంతువులు భూకంపాలకు ముందు వచ్చే అల్ట్రాసోనిక్ సౌండ్స్‌ను లేదా భూమిలోని మాగ్నెటిక్ ఫీల్డ్‌లో వచ్చే మార్పులను గుర్తించవచ్చు. చీమలు భూకంపం వచ్చే ముందు తమ గూళ్ళను వదిలి వేరే చోటికి వెళ్లిన సందర్భాలు మనం చాలానే గమనించాం. అయితే, ఈ ప్రవర్తనలు ఎప్పుడూ వైపరీత్యాలకు సూచికలుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని జంతువులు విపత్తు లేని సాధారణ సమయాల్లో కూడా అసాధారణంగా ప్రవర్తించొచ్చు, దీనివల్ల కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
కేవలం జంతువుల కారణంగా విపత్తులను అంచనా వేయడం కష్టమైన పని. ఈ విషయంలో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, జంతువుల సెన్సువల్ పవర్స్‌ను అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీ, సైంటిఫిక్ మెథడ్స్ ఈ విపత్తు హెచ్చరికతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జంతువులు ప్రకృతి వైపరీత్యాలను గుర్తించినప్పటికీ , వాటి ప్రవర్తనను ఆధారంగా చేసుకుని దానిని వార్నింగ్ సిస్టంగా ఉపయోగించడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఇప్పటికీ ఇది కష్టమైనా భవిష్యత్తులో వాటి ఇంద్రియ శక్తులన, టెక్నాలజీని ఉపయోగించి మరింత ప్రభావవంతమైన విపత్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు .