Big Stories

GST Council Meeting: ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, బ్యాటరీ కార్లకు ఇకనుంచి నో జీఎస్టీ

GST Council Meeting: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశం పలు నిర్ణయాలను తీసుకుంది. రైల్వేలు, ప్రయాణికులకు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది. ఇందులో ప్రయాణికుల విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, రైల్వే ఫ్లాట్ పామ్ టికెట్స్, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి. విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ. 20 వేల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫారసు చేసింది.

- Advertisement -

స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసిన పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ ఉంటుంది. అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతం తగ్గింపు. దీని ద్వారా యాపిల్‌తో పాటు పలు పండ్ల వ్యాపారులకు మేలు కలుగుతుంది. స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించారు. మరో వైపు, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. కౌన్సిల్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

గత సమావేశం అక్టోబర్‌లో నిర్వహించాం. ఎన్నికల కోడ్ కారణంగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ చాలా రోజులుగా జరగలేదు. ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌లో అనేక విషయాలు చర్చించాం. పన్నులు కట్టే వారికి అనేకమైన అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. చిన్న వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఉన్నాయి. ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News