Big Stories

Anti Paper Leak Act: అమల్లోకి యాంటీ పేపర్ లీక్ యాక్ట్ .. లీక్స్ కి చెక్ పడ్డట్టేనా..?

Government Introduces Anti-Paper Leak Law Amid NEET, NET Row: పేపర్‌ లీక్.. పదం చిన్నదైనా.. దీని ఎఫెక్ట్‌ వేలాది మంది విద్యార్థులు, అభ్యర్థులపై పడుతుంది. నీట్‌ కావొచ్చు.. NET కావొచ్చు.. ఎగ్జామ్‌ ఏదైనా పేపర్‌లీక్‌ కామన్‌ అనే పరిస్థితి వచ్చింది. దీనిని అరికట్టేందుకు యాంటీ పేపర్‌ లీక్ యాక్ట్‌ను తీసుకొచ్చింది కేంద్రం.. ఇంతకీ ఏంటీ ఈ చట్టం? ఈ చట్టం చెబుతున్నదేంటి? ఈ చట్టంతో పేపర్‌ లీక్‌లను కంట్రోల్ చేయవచ్చా? లేదా ఈ చట్టాన్ని కూడా అక్రమార్కులు తమ చుట్టంగా మార్చుకుంటారా? ద పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రివేన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌ యాక్ట్ 2024.. సింపుల్‌లో యాంటీ పేపర్‌ లీక్‌ చట్టం. ఈ చట్టం ఓవర్‌నైట్‌లో వచ్చింది కాదు. నిజానికి ఈ చట్టం ఫిబ్రవరిలోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందింది.

- Advertisement -

ఫిబ్రవరి 6న లోక్‌సభ.. 9న రాజ్యసభలో ఆమోదం పొందింది. అదే నెల 12న రాష్ట్రపతి ఈ చట్టానికి ఆమోద ముద్ర వేశారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా నోటిఫై కాలేదు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పేపర్‌ లీక్‌ పంచాయితీలు అంటే NEET, NET పేపర్ లీక్‌ ఆందోళనల దెబ్బకు ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ గెజిట్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. యూనియన్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్‌ కమిషన్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌, NEET, నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్‌, JEE నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి కేంద్ర ఏజెన్సీలన్ని కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ స్వతంత్ర సంస్థలు.. ఇప్పుడు ఈ చట్ట పరిధిలోకి వచ్చేశాయి.

- Advertisement -

మరి ఈ చట్టం ఏం చెబుతుంది? పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని తేలితే ఏం జరుగుతుంది? చట్ట విరుద్ధంగా ఎగ్జామ్‌ పేపర్స్‌ అందుకున్నా.. క్వశ్చన్స్‌ కానీ, ఆన్సర్స్ కానీ లీక్ చేసినా.. ఎగ్జామ్‌ అటెండ్ చేసే వారికి ఎలాంటి సాయం చేసినా.. టెక్నికల్‌ సపోర్ట్‌తో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ ట్యాంపరింగ్ చేసినా.. ఇల్లీగల్‌గా ఎగ్జామ్స్‌ నిర్వహించినా.. ఫేక్‌ హాల్‌ టికెట్స్‌ జారీ చేసినా.. ఈ చట్టం ప్రకారం అది నేరం. ఈ ఆరోపణలు నిజమైతే బాధ్యులకు కనీసం మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు కోటి రూపాయల వరకు ఫైన్ విధిస్తారు.

Also Read: Arvind Kejriwal bail petition: లిక్కర్ కేసు.. సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ, జూన్‌ 26న సుప్రీంకోర్టులో

ఈ నేరాల్లో భాగస్వాములైన వారికి కూడా శిక్షలు తప్పవు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని ఎగ్జామ్ కండెక్ట్‌ చేయడానికి అయిన మొత్తం ఖర్చును వసూలు చేస్తారు. అక్కడితో అయిపోలేదు.. ఈ కేసులన్ని నాన్‌ బెయిలబుల్‌గానే నమోదు చేస్తారు.. సో జైలు నుంచి బయటికి వచ్చే సీన్‌ కూడా లేదు. ఇక అక్రమాలు నిర్వహించిన వారిలో ఎగ్జామ్స్‌ నిర్వహించే అధికారుల పాత్ర ఉందని తేలితే వారికి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు.. కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

ఇవి చట్టంలోని విశేషాలు.. నిజానికి ఈ చట్టం ప్రస్తుతం చాలా అవసరం. ఎందుకంటే నీట్‌ ఆరోపణలు. NET రద్దు మాత్రమే కాదు. గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. వీటి వల్ల ఎఫెక్ట్‌ అయిన వారి సంఖ్య అక్షరాల కోటి 70 లక్షలు.. అందుకే ఇలాంటి చట్టం అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ చట్టం అమలులో కేంద్రం పాత్ర ఎంత ఉందో.. రాష్ట్రాల పాత్ర కూడా అంతే ఉంది. పేపర్‌ లీక్‌ మాఫియాను మట్టి కరిపించాలంటే రాష్ట్రాల్లో సమర్థవంతంగా దీనిని అమలు చేయాలి. తెలంగాణనే చూసుకోండి.. గ్రూప్‌ వన్ పరీక్ష లీక్ తర్వాత జరిగిన పరిణామాలు. పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాల్సి వారే.. లీక్‌లు చేసి లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడిలాంటి వారి వెన్నులో వణుకు పుట్టించే చట్టం ఇది.

Also Read: మంత్రికి సన్నిహితుడు.. బీజేపీ యువనేత దారుణ హత్య

బిహార్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాప్‌ సెలెక్షన్ కమిషన్‌ ఈ చట్టం నుంచి మినహాయింపు పొందాయి. దురదృష్టం ఏంటంటే ఈ రెండు కమిషన్లలోనే ఎక్కువ పేపర్‌ లీక్‌లు అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చట్టాన్ని ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బాల్‌ మాత్రం ఆయా రాష్ట్రాల కోర్టుల్లో ఉంది. మరోవైపు నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ తర్వాత కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్స్‌ సజావుగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో హైలెవల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఎగ్జామ్స్‌ నిర్వహణలో ఎలాంటి సంస్కరణలు అవసరం.. ? డేటా సెక్యూరిటీ ఎలా ఉండాలి..? NTA పనితీరును ఎలా మెరుగుపరచాలి? అనే అంశాలపై సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ.. 2 నెలల్లో కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వనుంది ఈ కమిటీ అయితే చట్టం చేస్తే పేపర్‌ లీక్‌లను అరికట్టినట్టేనా? అస్సలు కాదు.. దానిని పకడ్బంధీగా అమలు చేయాలి. అప్పుడే ఈ పేపర్ లీక్‌ మాఫియాను కట్టడి చేయగలం.ఎడ్యుకేషన్ బాడీస్‌, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరు బాధ్యతతో ఉండాలి. అప్పుడే ఈ పేపర్‌ లీక్‌లు ఆగుతాయి.. పరీక్షలు రాసే వారికి భరోసా ఉంటుంది.

Also Read: CBI probing UGC-NET paper leak case: యూజీసీ నెట్ పేపర్ లీక్ ఎంక్వైరీ, సీబీఐ టీమ్‌పై గ్రామస్తుల దాడి

ఇదంతా ఓ కోణం.. అయితే ప్రస్తుతం నీట్ ఎగ్జామ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. నీట్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది రాజకీయ అంశంగా మారింది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సుప్రీంకోర్టు కూడా నీట్‌ను కౌన్సిలింగ్‌ను ఆపేది లేదని తేల్చి చెప్పింది. అదే సమయంలో నీట్‌ను నిర్వహించిన NTAకు కూడా అక్షింతలు వేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ఈ ఆందోళనలకు చెక్‌ పెడుతుందా? లేదా? చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News