Big Stories

Kiran Choudhry Resigns to Congress : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం కోడలు రాజీనామా

Kiran Choudhry Resigns to Congress(Telugu breaking news) : హర్యానా కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి కూడా పలువురు కీలక నేతలు పార్టీకి హ్యండ్ ఇస్తున్నారు. తాజాగా మాజీ సీఎం కోడలు ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

- Advertisement -

హర్యానా మాజీ సీఎం బన్సీలాల్ కోడలు అయిన కిరణ్ చౌదరి కుమార్తె శృతి చౌదరికి లోక్ సభ టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ తరుణంలో ఆమె పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. హర్యానా కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా శృతి చౌదరి వ్యవహరిస్తున్నారు. భివానీ, మహేంద్రగఢ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తన కుమార్తెకు లోక్‌సభ సీటు ఇవ్వాలని కిరణ్ చైదరి పార్టీ అధిష్టానాన్ని కోరారు. కానీ పార్టీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించడంతో ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా పార్టీ వర్గాల్లో అయోమయం రేకెత్తిస్తుంది. కిరణ్ చౌదరి, శృతి చౌదరి బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News