EPAPER
Kirrak Couples Episode 1

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!

Farmer Finds 6.65 Carat Diamond: బాప్రే.. చిటికెలో లక్షదికారి అయిన రైతు.. 25 లక్షల విలువ చేసే వజ్రం లభ్యం!

Farmer Finds 6.65 Carat Diamond: మధ్యప్రదేశ్‌లో పన్నా ప్రాంతం వజ్రాలకు ఫేమస్. అక్కడ వజ్రం ఎవరికైనా దొరికితే వాళ్లు అదృష్టవంతులని అంటారు. ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా లీజుకు తీసుకున్న ప్రాంతంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. మార్కెట్‌లో దాని విలువ దాదాపు 25 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా.


పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ అనే రైతు కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. ఆ గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. వెంటనే దాన్ని పన్నా డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. దీన్ని త్వరలో వేలం వేయనున్నారు. ఈ వజ్రం దాదాపు 25 లక్షలు విలువ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదే రైతుకు గతంలో ఓసారి వజ్రం దొరికింది. దాని విలువ లక్ష మాత్రమే. ఈసారి మాత్రం దేశ్‌రాజ్‌కు పంట పండింది. ఇంకా లోతుల్లోకి వెళ్తే.. కౌరేయ కకర్రాహతి గ్రామానికి చెందిన రైతు దేశ్‌రాజ్. కొన్నాళ్ల కిందట ఈయన పట్టిబజారియా గ్రామంలో కొంత భూమిని లీజుకున్నాడు. కొద్దిరోజులుగా అక్కడ వజ్రాల కోసం వేట సాగిస్తున్నాడు. గులకరాళ్లు, మట్టితోపాటు మెరుస్తున్న రాయి కనిపించింది. వెంటనే ఆ రైతు ఆనందానికి అవదుల్లేవు. గతంలో 1.35 క్యారెట్ల వజ్రం కాగా, ఇప్పుడు 6.65 క్యారెట్లు.


Also Read: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

ప్రస్తుతం పన్నాలో వజ్రాలు వ్యాపారం మందగించింది. గతంలో దొరికిన వజ్రాలకు ఎన్నోసార్లు వేలం నిర్వహించారు. పెద్దగా అమ్ముడుపోయిన సందర్భాలు రాలేదు. అవన్నీ చిన్నవి కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈసారి ఆరు క్యారెట్ల వజ్రం కావడంతో ధర భారీగానే ఉంటుందని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు.

Tags

Related News

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Fire Cracker Factory Explosion: తమిళనాడు.. టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Kerala landslide: కేరళ వరదల్లో లారీ డ్రైవర్ గల్లంతు.. 71 రోజుల తరువాత మృతదేహం ఎలా గుర్తుపట్టారంటే?..

Big Stories

×