Tollywood:సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గా ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఏదైనా సినిమా విషయంలో ఒకరికి వచ్చిన ఆఫర్ ని మరొకరు తన్నుకుపోతే ఇది తలుచుకొని మరో హీరో లేదా హీరోయిన్ బద్ధ శత్రువులుగా మారుతూ ఉంటారు.అయితే అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది మాత్రం అలా ఉంటారు. కొంతమంది సెలబ్రిటీల మధ్య ఆధిపత్యపోరు అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అలాగే ఇద్దరు హీరోల మధ్య లేదా ఇద్దరు హీరోయిన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ కూడా చూశాం. కానీ వాటన్నింటికీ ఈ హీరోయిన్లు వ్యతిరేకం. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్లు సినిమా రంగంలో ఉన్నా కూడా ఎలాంటి కోపతాపాలు లేకుండా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇకపోతే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
రాశిఖన్నా – వాణి కపూర్:
రాశిఖన్నా (Rashii Khanna),వాణి కపూర్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. ముఖ్యంగా రాశిఖన్నాకి వాణి కపూర్ (Vani Kapoor)అంటే చాలా ఇష్టమని స్వయంగా రాశి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది.ఇక వీరిద్దరు హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
కీర్తి సురేష్ – కళ్యాణి ప్రియదర్శిని:
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ (Keerthy Suresh), కళ్యాణి ప్రియదర్శన్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట. వీరిద్దరూ సీనియర్ హీరోయిన్ల కూతుర్లే..అలా చిన్నప్పటి నుండి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతుందట.అలా సినిమాల్లోకి రాకముందు నుండే వీరి మదర్ ల కారణంగా ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ఇద్దరు తమ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూనే ఉన్నారు.
తమన్నా – శృతిహాసన్ :
తమన్నా (Tamannaah) శృతి హాసన్ ల మధ్య డీప్ ఫ్రెండ్షిప్ ఉంది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రతి సందర్భంలో చెప్పుకుంటారు. ముఖ్యముగా శృతి హాసన్ (Shruti Haasan) ఓ ఇంటర్వ్యూలో నేను అబ్బాయిని అయితే కచ్చితంగా తమన్నానే పెళ్లి చేసుకునే దాన్ని అంటూ తన మనసులో ఉన్న మాట చెప్పింది. అంతేకాదు తమన్నా మనసు చాలా మంచిదని చెప్పుకొచ్చింది. ఇక వీరిద్దరూ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ఒకరి స్పెషల్ డే రోజు మరొకరు కచ్చితంగా విష్ చేసుకుంటూ ఉంటారట.
తమన్నా-కాజల్ అగర్వాల్ :
ఇక తమన్నాకి శృతిహాసన్ తోనే కాకుండా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తో కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ సినిమాల్లో రాణిస్తూనే వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇక వ్యాపార రంగంలో ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ఉంటారట.
త్రిష – ఛార్మీ :
సీనియర్ నటీమణులు అయినటువంటి త్రిష (Trisha), ఛార్మీ ఇద్దరు చాలా మంచి మిత్రులు. త్రిష – ఛార్మి (Charmi) మధ్య ఇండస్ట్రీకి రాకముందు నుండే ఫ్రెండ్షిప్ కొనసాగుతుందట. అలా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మని చెప్పుకుంటారు. అలాగే సమయం దొరికినప్పుడు వీరిద్దరూ పార్టీలు చేసుకుంటూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
వీరే కాకుండా కీర్తి సురేష్ – సమంత , అంజలి – భాను , మంచు లక్ష్మి -రకుల్ ప్రీత్ సింగ్ -ప్రగ్యా జైస్వాల్ వంటి వారు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం.
ALSO READ:Film industry: మన హీరోయిన్స్ కి ఆ పాత్ర సెట్ కాదా.. తెలిసీ.. తప్పుచేసి.. అవమానపడ్డ హీరోయిన్స్!