E-Paper
Advertisement

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!
Advertisement

OG Movie Advance Bookings: ఓ వైపు ఓజీ మూవీ టీంపై నెగిటివిటీ తీవ్రం అవుతుంటే.. మరోవైపు మూవీపై బజ్‌ పెరుగుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ'(They Call Him OG) మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ గురువారం(సెప్టెంబర్‌ 25) వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. సాహో దర్శకుడు సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగాఇప్పటి వరకు విడుదలైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌ మూవీపై హైప్‌ పెంచాయి. ఇక ట్రైలర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి.

ఓజీ రికార్డు వసూళ్లు!

Advertisement

ప్రచార పోస్టర్స్‌, గ్లింప్స్, ట్రైలర్‌తో ఓజీ మూవీ భారీ హైప్‌ని సెట్‌ చేసుకుంది. ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్‌ రిలీజ్‌ కి సిద్దమవుతున్న ఓజీ.. విడుదలకు ముందే రికార్డు క్రియేట్‌ చేస్తుంది. రిలీజ్‌కి ఇంకా రెండు రోజులు ఉంది. అప్పుడే మూవీ వసూళ్లలో ఊచకోత చూపిస్తోందట. మూవీ ఉన్న హైప్‌, బజ్‌తో ఓజీ టికెట్స్‌ హాట్‌ కెక్కుల్లా అమ్ముడుతున్నాయి. అన్ని ఎరియాల్లోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ఇతర భాషల్లోనూ ప్రీ బుకింగ్స్‌లో ఓజీ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో విడుదలకు ముందే ఓజీ బిజినెస్‌ షాకిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమాకు ఉన్న బజ్‌ చూసి డిస్ట్రిబ్యూటర్స్‌ మూవీని కొనేందుకు పోటి పడ్డారు.

నిర్మాతలు కోట్‌ చేసిన నెంబర్‌కే ఓకే చెప్పి.. సినిమాను కోనుగోలు చేశారు. అలా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఓజీ మూవీకి సత్తా చాటుతోంది. హాట్‌ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓవర్సిస్‌ లో సుమారు మూడు మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేసినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇండియాలోనూ ఓజీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మామూలుగా లేదు. ప్రీమియర్స్‌ షోలు, థియేట్రికల్‌ రైట్స్‌తో బిజినెస్‌ భారీగా జరిగింది. అలాగే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఓజీ చిత్రానికి వరల్డ్‌ వైడ్‌గా రికార్డు బుకింగ్స్‌ నమోదయ్యాయి. దీంతో సినిమాకు థియేట్రికల్‌ రైట్స్‌, అడ్వాన్స్‌ బుకింగ్స్‌, ప్రీమియర్స్‌ షోలతో ఈ చిత్రం ఇప్పటికే వసూళ్లలో హాఫ్‌ సెంచరికి చేరువైంది.

Advertisement

Also Read: OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

అప్పుడే రూ. 50 కోట్లు వసూళ్లు

ఇప్పటి ఓజీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దగ్గర దగ్గర రూ. 50 కోట్ల చేసినట్టు ట్రేడ్‌ సర్కిల్లో టాక్‌ నడుస్తోంది. రిలీజ్‌కి ముందే మూవీ రూ. 50 కోట్ల మార్క్‌ చేయడం విశేషం.  ఓజీ కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఫస్ట్‌ డే మూవీకి రికార్డు ఓపెనింగ్స్‌ రానున్నాయంటున్నారు. మరి సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్‌ బ్రేక్‌ చేస్తుందో చూడాలి!  కాగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రతి కథానాయకుడిగా కనిపించబతున్నాడు. ఓమీ అనే నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న గ్యాంగ్‌స్టర్‌ కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంతోనే ఇమ్రాన్‌ హష్మీ.. టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇందులో గ్యాంగ్‌లీడర్‌ భామ ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ వంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Related News

రష్మిక రణబాలి ఒకే చేయడానికి అతనే కారణమా? విజయ్ మాత్రం కాదండోయ్!

సీరియల్‌లో రూ.750తో మొదలు.. ఇప్పుడు కోట్లలో పారితోషికం! రచితా రామ్ జర్నీ ఇదే

‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

Big Stories

Advertisement
×