Deepika Padukone Interval Scene: దీపికా పదుకొనె.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ పేరు మారుమ్రోగుతుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసిన ఈమె గురించే చర్చ. వరుసగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి తప్పించడంతో దీపికా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ము ఖ్యంగా కల్కి 2 నుంచి దీపికా తప్పిస్తున్నట్టు మూవీ టీం ప్రకటించినప్పటి నుంచి దీపికా తీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతకు ముందు స్పిరిట్ మూవీ నుంచి కూడా ఆమెను తీసేయడంతో దీపికా నెట్టింట పుల్ నెగిటివిటీ మొదలైంది. ఆమెను తప్పుబడుతూ.. డైరెక్ట్ ట్వీట్స్, పోస్ట్స్ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దీపికా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో దీపికాకు ఫ్యాన్స్ నుంచి ఫుల్ మద్దతు లభిస్తోంది.
ఆమె ఒక స్టార్, వెండితెరపై ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించి వాటికి జీవం పోసింది. అలాంటి స్టార్ నటికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమంటున్నారు. మరికొందరైతే ‘కల్కి 2898 ఏడీ‘లో ఆమె నటనను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఇందులో ప్రభాస్ నటనని కూడా ట్రోల్ చేస్తురన్నారు. కల్కి 2 దీపికా వల్ల హిట్ అయ్యింది, ఇంటర్వెల్ ముందు సీన్‌లో ఆమె నటన అద్బుతం అంటూ కొనియాడుతున్నారు. ఈ సందర్బంగా కల్కి 2898 ఏడీ చిత్రంలోని ఇంటర్వెల్ సీన్‌ని షేర్ చేస్తున్నారు. ఇందులో దీపికా నటన ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. “ఈ సన్నివేశాన్ని ఇంత ఆరాతో ఏ నటి అయినా చేయగలదని కొందరు అనుకుంటారు. నిజానికి కల్కి మూవీ రూ. 900 కోట్లు వసూలు చేస్తే.. ఒక్క దీపికా ఈ ఇంటర్వెల్ సీన్ ఒక్కటే రూ. 300 కోట్లు వసూళ్లు చేసిందని చెప్పొచ్చు. ఈ సీన్ ఆమె నటన అద్బుతం.
మొదటి భాగమంలో సగం సినిమా ప్రభాస్ జోకర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బోరింగ్‌గా చెత్తగా సాగుతున్న క్రమంలో దీపికా ఈ ఒక్క సీన్తో సినిమాను నిలబెట్టింది. ఈ సన్నివేశంలో దీపికా తనదైన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్ చూపు తిప్పుకోకుండ చేసి సినిమాపై ఆశలు పుట్టించింది” అంటూ తమ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీపికాకి వస్తున్న నెగిటివిటీని పక్కన పెడితే.. నిజంగానే దీపికా తన నటనతో ఇంటర్వెల్కి ప్రాణం పోసింది. యాష్కిన్ నుంచి తప్పించుకుని బయటపడ్డ ఆమె.. మంటల మధ్య నడుస్తూ.. బయటకు వస్తుంది. ఈ సీన్‌లో ఆమె ఏమాత్రం భయం, బెణుకు చూపించలేదు. ఓ తల్లిగా.. తన ప్రాణాల కంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణలే ముఖ్యం అన్నట్టుగా కేవలం ఎక్స్ప్రేషన్స్తోనే సీన్ కి ప్రాణం పోసింది. ఇక్కడ ఆమె ఎమోషన్‌ని అద్బుతంగా పలికించింది.
నిజంగానే ఈ ఇంటర్వెల్ సీన్ మూవీ మొత్తాన్ని నిలబెట్టిందనడంలో సందేహం లేదు. అలాగే కల్కి 2898 ఏడీలో దీపికా పాత్ర ఉండటం నార్త్లో బాగా ప్లస్ అయ్యింది. అమితాబ్, దీపికాల వల్ల నార్త్ ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపించారనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్లో దీపికా పాత్ర కీలకమనే చెప్పోచు. ప్రమోషన్స్ టైంలో దీపికా డెడికేషన్ సైతం పొగిడారు. కల్కి మూవీ చేస్తున్న టైంలో దీపికా నిజంగానే గర్బవతి అనే విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ సమయంలోనూ ఆమె షూటింగ్లో పాల్గొని పెద్ద సాహసమే చేసింది. నిండు గర్భిణిగా ఉండి కూడా మూవీ ప్రమోషన్స్లో పాల్గొని తన బాధ్యతను నిర్వర్తించింది. అలాంటి దీపికాను.. వైజయంతీ మేకర్స్ సినిమా నుంచి తొలగించారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంత నమ్ముతున్నారు. మరి అదేంటనేది తెలియాలంటే దీపికా తన మౌనం విడాల్సి ఉంది.
Some People Think any actress can do this scene with this much of Aura
If Kalki Collects 900Cr
This Interval scene Of #DeepikaPadukone alone fetched 300CrWhen complete 1st half of Kalki is Worst with Prabhas Joker Expressions,This scene gives some hope pic.twitter.com/uFqkZPPMwv
— Hemanth Kiara (@UrsHemanthKiara) September 19, 2025