BigTV English

Cracked heels: మడమలు పగిలిపోయాయా..? ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోతాయి

Cracked heels: మడమలు పగిలిపోయాయా..? ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోతాయి

Cracked heels: శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీంతో మడమలు కూడా పగిలిపోతాయి. దీని వల్ల మడమల మీద చర్మం పొడిగా మారిపోతుంది. డెడ్ స్కిన్ సెల్స్ కారణంగా కాళ్లు అందవికారంగా మారిపోతాయి. కొన్ని సార్లు దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మడమల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి..?
అత్యంత సాధారణ కారణం కేవలం పొడి చర్మం. మడమల మీద చర్మం తేమను కోల్పోయినప్పుడు పగుళ్లు వస్తాయి. ముఖ్యంగా చల్లని నెలల్లో ఎక్కువ సమయం గడిపినప్పుడు లేదా గాలి పొడిగా ఉన్నప్పుడు ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ బరువును మోయడం లేదా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కూడా కాళ్లలో పగుళ్లు వస్తాయట.

పాదాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మాయిశ్చరైజ్ చేయకపోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి పగుళ్లు, కాలిస్‌లు వచ్చే ఛాన్స్ ఉందట. మరికొందరిలో మధుమేహం, తామర, సోరియాసిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి కొన్ని పరిస్థితుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత తేమ లేకపోవడం వల్ల లేదా కఠినమైన సబ్బులు వాడడం వల్ల మడమల్లో పగుళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.


ఏం చేస్తే తగ్గుతుంది..?
పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లేదా షియా బటర్ వంటి మందపాటి, ఎమోలియెంట్-రిచ్ క్రీమ్‌లు లేదా నూనెలను వాడడం వల్ల మడమల పగుళ్లు తొలగిపరోతాయట. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత మీ చర్మం తేమగా ఉండటానికి మాయిశ్చరయిజర్ వాడడం మంచిది. యూరియా లేదా లాక్టిక్ యాసిడ్‌ ఉన్న క్రీమ్‌లను వాడడం మంచిది. ఇది గట్టిపడిన చర్మాన్ని రిపేయిర్ చేయడంలో హెల్ప్ చేస్తుందట.

ఈ టిప్స్ ట్రై చేయండి..
పాదాలను వెచ్చని, సబ్బు నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల గట్టి చర్మం మృదువుగా మారుతుంది. అవసరమైతే కాళ్లను నానబెట్టడానికి ఎప్సమ్ లవణాలు లేదా టీ ట్రీ ఆయిల్ వంటి నూనెలను వాడడం మంచిది. నానబెట్టిన తర్వాత, డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించడానికి ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైల్‌ని ఉపయోగించి మెల్లగా ఎక్స్‌ఫోలియేట్ చేయండి.

ప్యూమిస్ స్టోన్, ఫుట్ ఫైల్ లేదా ఎక్స్‌ఫోలియేటింగ్ ఫుట్ స్క్రబ్‌తో పగిలిన ప్రాంతాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఇది డెడ్ స్కిన్‌ను తొలగించి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

ఓపెన్-బ్యాక్డ్ షూస్ లేదా చెప్పులను వాడడం మానేస్తే మడమలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంతో పాటు పగుళ్లను నివారించడానికి మంచి ఆర్చ్ సపోర్ట్, కుషన్డ్ హీల్ ఉన్న చెప్పులు వేసుకోవడం ఉత్తమం. చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచడానికి రోజంతా నీరు పుష్కలంగా తాగాలి.

ALSO READ: జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే..?

సాలిసిలిక్ యాసిడ్, యూరియా లేదా లాక్టిక్ యాసిడ్ ఉన్న క్రీమ్‌లను వాడడం వల్ల మడమల పగుళ్లు తగ్గిపోయే అవకాశం ఉందట. ఈ పదార్థాలు కఠినమైన చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాపడతాయట.

పడుకునే ముందు, మడమల మీద మాయిశ్చరైజర్,పెట్రోలియం జెల్లీ వంటివి అప్లై చేయయడం మంచిది. రాత్రంతా కాటన్ సాక్స్ వేసుకోవడం వల్ల చర్మంలరో తేమ పెరుగుతుంది. మీ మడమల మీద మరింత ఒత్తిడిని నివారించడానికి మీ గోళ్లను క్రమం తప్పకుండా కట్ చేసుకోవాలట.

పగుళ్లు లోతుగా ఉన్నా లేదా ఎరుపు, వాపు, చీము వంటి ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపిస్తే, డాక్టర్ లేదా పాడియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఇటు వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పగిలిన మడమలు తిరిగి రాకుండా నిరోధించవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×