Chia Seeds vs Sabja Seeds: చియా సీడ్స్, సబ్జా సీడ్స్.. రెండూ ఆరోగ్యానికి మంచి లాభాలు అందించే అద్భుతమైన సూపర్ ఫుడ్స్. అయితే, వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, ఇతర ప్రోటీన్స్ వల్ల దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి ఏది తీసుకుంటే బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకుందాం..
చియా సీడ్స్:
చియా సీడ్స్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయట. అంతేకాకుండా చియా విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇందులోని ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చూడడమే కాకుండా మంచి పోషణ అందిస్తాయి. బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చియా సీడ్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందట. బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయట
సబ్జా సీడ్స్:
సబ్జా సీడ్స్‌లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. వేసవి కాలంలో డీహైడ్రేషన్ నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఇవి తలనొప్పి, పొట్ట నొప్పి వంటి వాటిని తగ్గించేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుందట. సబ్జా గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో కూడా సహకరిస్తాయట.
ప్రతి రోజూ పరగడుపున సబ్జా గింజలు ఉంచిన నీళ్లను తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరును ప్రభావితం చేసే గ్లైకోసైడ్‌ని కంట్రోల్ చేసేందుకు కూడా సబ్జా గింజలు హెల్ప్ చేస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. బరవు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్న వారు కూడా వీటిని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏది బెస్ట్..?
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ ఉండటంతో ఇవి చాలా పోషకహారాలు కలిగి ఉంటాయి. ఇవి గుండెను రక్షించడంతో పాటు, బరువు తగ్గించడంలో సహాయపడతాయ. జీర్ణవ్యవస్థను బలపరిచేందుకు తోడ్పడతాయట. అంతేకాకుండా శరీరంలో వాటర్ కంటెంట్‌ని పెంచేందుకు కూడా హెల్ప్ చేస్తాయట.
సబ్జా సీడ్స్‌లో ఫైబర్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. సమ్మర్ డైట్‌లో మాత్రం సబ్జా గింజలను చేర్చుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఇది సహకరిస్తుందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.