Big Stories

Liver Damage Early Signs: రాత్రంతా చేతులు, కాళ్లలో దురదగా ఉంటుందా.. అయితే మీ లివర్ డేంజర్‌లో ఉన్నట్లే

Liver Damage Early Signs:చాలా మంది రాత్రి వేళ దురద సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇది కాలేయం దెబ్బతినడానికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవినశైలి కారణంగా శరీరంలోని చాలా భాగాలు ప్రభావితం అవుతుంటాయి. అందులో ముఖ్యంగా గుండె, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాల్లో సమస్యలు ఏర్పడితే అది జీవించడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. కాలేయం మన పొట్టలో కుడివైపు ఎగువ భాగంలో పక్కటెముకల క్రింద ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో, టాక్సిన్స్‌ను తొలగించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

- Advertisement -

మొత్తం మీద, కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన ఘనమైన అవయవం. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సరైన జీవనశైలి పాటించకపోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కాలేయం దెబ్బతినడం వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాలేయ సమస్య విషయంలో, ప్రారంభంలో కొన్ని సంకేతాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే శరీరంలో ఏ లక్షణాలు కనిపించినా కూడా అప్రమత్తంగా ఉండాలి.

- Advertisement -

రాత్రిపూట దురద

కొందరికి రాత్రిపూట దురద సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కాలేయంలో ఏదైనా సమస్య ఉంటేనే దురద ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. కాలేయ సమస్యల కారణంగా శరీరంలో చాలా దురదలు మొదలవుతాయి. కానీ రాత్రిపూట దురద అదుపు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పాదాలు ఎక్కువగా దురద పెడతాయి. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇతర లక్షణాలు:

కడుపులో వాపు: కాలేయ వ్యాధిలో, కడుపులో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కడుపు చుట్టూ వాపు ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News