Big Stories

World Blood Donor Day 2024: ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా?

World Blood Donor Day 2024 Date, Significance And Importance and More: ప్రతి సంవత్సరం జూన్ 14న రక్తదాన దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది రక్తదానం దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. రక్తాన్ని దానం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించవచ్చు. రక్తదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజున అనేక చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేస్తారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి, ఈ రోజు వేడుక ఎలా ప్రారంభమైంది. “రక్తదానం ఎందుకు గొప్ప దానంగా” పరిగణించబడుతుందో తెలుసుకుందాం.

- Advertisement -

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2004లో స్థాపించారు. ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టెయినర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1940లో కార్ల్ ల్యాండ్‌స్టెయినర్ ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్‌ను కనుగొన్నాడు. ఇది సక్సెస్ కావడంతో అతనికి నోబెల్ బహుమతి లభించింది.

- Advertisement -

ఈ సంవత్సరం థీమ్ ఇదే!

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ సంవత్సరం థీమ్ ను ప్రకటించింది. “అవసరమైన వారికి సహాయం చేయడమే” అని తమ అధికార వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ థీమ్ ద్వారా లక్షలాది మంది రక్తదాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీని కారణంగా ఆరోగ్య పరిశ్రమ రక్త మార్పిడిని సజావుగా నిర్వహించగలుగుతుంది. దీనితో పాటు ఈ రోజున సాధారణ రక్తదాన సంస్కృతిని ప్రోత్సహించడానికి యువకులు, సాధారణ ప్రజలలో రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని WHO తెలిపింది.

రక్తదానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా రక్త స్నిగ్ధతను (మందం) తగ్గిస్తుంది, ఇది గుండెను పంప్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లెడ్ డొనేషన్ చేయడానికి కనీస వయసు 18- 65 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస బరువు 46 కిలోలు అయినా ఉండాలి. హెచ్ బి 12 గ్రాములు ఉండాలి. ఆరోగ్యంగా ఉన్న పురుషులు మూడు నెలలకు ఒకసారి.. స్త్రీలు నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News