Big Stories

Russian President Putin: పుతిన్, కిమ్ కీలక భేటీ..అమెరికా ఆంక్షలపై చర్చిస్తారా..?

Russia’s Putin to visit North Korea: ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు పుతిన్ ఉత్తర కొరియాకు మంగళవారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఈ దేశంలో పుతిన్ పర్యటించడం గత 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పుతిన్ మొదటిసారి ఉత్తర కొరియాకు 2000లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అప్పటి అధ్యక్షుడు కిమ్ తండ్రి కిమ్ జోంగ్‌ ఇల్‌తో సమావేశమయ్యారు. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నిర్వహిస్తున్న తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -

సైనిక సహకారంపై చర్చ..
అమెరికా ఆంక్షలను ఇరు దేశాలు వేర్వేరుగా ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కిమ్ ఆహ్వానం మేరకు పుతిన్ భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య సైనిక సహకారం మరింత విస్తరించుకునేందుకు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై మిగతా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న తరుణంలో.. రష్యానుంచి ఆర్థిక సహకారంతోపాటు సాంకేతిక పరంగా సహాయం తీసుకొని అవసరమైన ఆయుధాలు, క్షిపణులను ఉత్తరకొరియా ఇచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నుంచి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి సైనిక సహకారం వృద్ధి చేసుకునేందుకు ఇరు దేశాలు భావిస్తున్నాయి.

- Advertisement -

అమెరికాను ఎదుర్కొంటాం..
అమెరికా విధించిన సవాళ్లను రష్యా, ఉత్తరకొరియా దేశాలు కలిసికట్టుగా ఎదుర్కొంటాయని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని, అనేక విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తన్నాయని పుతిన్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు పరఫరా చేసే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్నందున బాంబులు, క్షిపణులతో పాటు సైనిక వ్యవస్థలను అందజేసే అవకాశం ఉందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Also Read: సంచలన నిర్ణయం తీసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని

ఉత్తర కొరియా, రష్యాపై అమెరికా కఠిన ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. అణ్వాయుధాల అభివృద్ధి విషయం, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పుతిన్ పర్యటనలో ఇరు దేశాధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భద్రత, రక్షణపరమైన సహకారంపైనే ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై అమెరికా స్పందించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇరు దేశాలధినేతలు సమావేశం కావడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, వారి మధ్య బలపడుతున్న బంధం ఆందోళన కలిగిస్తుందని అమెరికా భద్రతా మండలి అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News