Ramya Krishnan: ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya krishnan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 90 లలో ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన నటనతోనే కాదు గ్లామర్ తో కూడా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు గ్లామర్ షో చేయాలంటేనే భయపడే కాలంలో కూడా గ్లామర్ షో ప్రదర్శించి, యువతను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమె అందం చూసి యువత ఫిదా అయిపోయారు. దాంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వాస్తవానికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత తన నటనలోని టాలెంట్ నిరూపించుకుంటూ మరింత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రమ్యకృష్ణ.
క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..
ఇకపోతే ఎంతోమంది హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చిన ఈమె ఆ తరువాత కాలంలో కొత్త హీరోయిన్ల రాకతో తన హవా తగ్గిపోయింది. దాంతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవడం ఇష్టం లేక హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ లో కూడా నటించి, ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలు రమ్యకృష్ణకు మరింత పేరు తీసుకొచ్చాయి. బాహుబలి సినిమాలో ‘శివగామి’గా తన అద్భుతమైన క్యారెక్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది .అలా ఈమె కెరియర్లో బాహుబలికి ముందు.. ఆ తర్వాత.. అన్నట్టుగా మారిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమె.. ఏదైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం కలది. అందుకే ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పై మరొకసారి నోరు విప్పి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయాన్ని మళ్లీ తెలియజేసింది రమ్యకృష్ణ.
స్టార్ హీరోయిన్ అవ్వాలంటే బెడ్ ఎక్కాల్సిందే – రమ్యకృష్ణ
తాజాగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరన్నారు..? స్టార్ హీరోయిన్గా ఎదగాలి అంటే కచ్చితంగా దర్శక నిర్మాతలు చెప్పింది వినాల్సిందే. ఒక్కొక్కసారి హీరోల కోరికలు కూడా తీర్చాల్సి ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవాలంటే బెడ్ ఎక్కాల్సిన రోజులు కూడా వస్తాయి. అన్నింటిని అధిగమిస్తేనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ లభిస్తుంది” అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది రమ్యకృష్ణ. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ చేసిన కామెంట్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అవ్వాలి అంటే ఇలాంటి పనులు చేయాల్సిందేనా..? ఈ సీనియర్ హీరోయిన్ మాటలకు అర్థం అదేనా? అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పటికే పలు ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతుంటే.. మరికొంతమంది బయటకు చెబితే అవకాశాలు ఇవ్వరేమో అనే భయంతో ఆగిపోతున్నారు. అందుకోసమే మలయాళం లో మీటు ఉద్యమంతో పాటు జస్టిస్ హేమ కమిటీ కూడా నియమించిన విషయం తెలిసిందే. మరి ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటికీ ఆగుతాయో చూడాలంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Tamannaah: తమన్నా చేసిన పనికి కన్నడిగులు ఫైర్… సపోర్ట్ గా నిలిచిన ఆ రాష్ట్ర మంత్రి..!