Big Stories

Allegations on Jackky Bhagnani: రకుల్ భర్త పెద్ద మోసగాడు.. రెండు నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు: పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ ఉద్యోగులు

Allegations on Rakul Preet Singh Husband Jackky Bhagnani: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిచి పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితంలో మధురిమలు పంచుకుంటూనే ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రకుల్ ఒకప్ప సినిమాలు చేస్తూనే ఇంకోపక్క హోటల్ బిజినెస్ కూడా చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో జాకీ.. చిక్కుల్లో పడ్డాడు. జాకీ.. పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సినిమాలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

- Advertisement -

ఇక తాజగా పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ లో పనిచేస్తున్న ఉద్యోగులు.. జాకీపై ఘాటు ఆరోపణలే చేశారు. రెండు నెలలుగా టాంకు జీతాలు ఇవ్వడం లేదని, తమ పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ఒకరు ఇద్దరు కాదు.. మొత్తం 100 మంది తమ ఆవేదనను తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ లో స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి. సినిమాలు అయితే వచ్చాయి కానీ, సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇక దీంతో జాకీ, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదట.

- Advertisement -

షూటింగ్ పూర్తి అయిన 40 రోజులకు క్లియర్ చేస్తామని చెప్పిన యాజమాన్యం రెండు నెలలు అయినా కూడా డబ్బులు ఇవ్వలేదని, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తమని తిప్పి పంపిచేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా ఇలా పోస్ట్ చేయడం వలన మాకు ఒరిగేది లేదని కానీ, జాకీ భగ్నానీ లాంటి మోసపూరితమైన వారి గురించి చెప్తే.. రేపు మాలా ఎవరు మోసపోకూడదని చెప్తున్నట్లు వారు తెలిపారు.

Also Read: Vijayashanti Birthday : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. పోలీస్ లుక్ లో ఏముంది బాసూ

ఇప్పుడే కాదు.. అవుట్ డోర్ షూట్ కు వెళ్ళినప్పుడు కూడా వారు మంచి భోజనం పెట్టింది లేదని, ఇలా మేము పోస్టులు పెట్టడం పద్దతి కాదని తెలుసు, కానీ, మేము కష్టపడిన సొమ్మును వదులుకోలేక ఇలా చేయాల్సి వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వార్తపై జాకీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News