Big Stories

Swag Teaser: భవభూతి – ది ఫేస్ ఆఫ్ ది మేల్ ప్రైడ్

Swag Teaser: ఓం భీం బుష్ తరువాత కుర్ర హీరో శ్రీవిష్ణు మరో కొత్త కథతో రాబోతున్నాడు. అదే స్వాగ్. హసిత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక హైప్ క్రియేట్ అవుతూనే వస్తుంది.

- Advertisement -

అచ్చ తెలుగు సినిమా అని చెప్తూ స్వాగ్ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత మగజాతిని కాపాడే రక్షా అంటూ హీరో క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఇక వరుసగా హీరోయిన్స్ ను మహారాణులుగా చూపించారు. రీతువర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

- Advertisement -

తాజాగా రేజర్ అనే పేరుతో స్వాగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అంతా మగవారి గురించి చెప్పడమే సరిపోయింది. అందులోనూ ముసలి పాత్రలో విష్ణు కనిపించాడు. మగవాడంటే మీకేం గుర్తొస్తుందంటూ ఒక రకమైన బేస్ వాయిస్ తో వృద్ధుడి రోల్ లో ఉన్న శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో రేజర్ ప్రారంభమైంది. ఇక దానికి సమాధానంగా ఒక మగ గొంతు వేలెడంత పొగరు అని చెప్పగా.. ఒక మహిళ గొంతు వంశాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాడంటూ చెప్పగానే శ్రీవిష్ణు ఫేస్ లో నవ్వులు విరబూస్తాయి.

ఆ వీరగర్వంతో తాగుదామా అంటూ హుషారు పెంచాడు శ్రీవిష్ణు. దివాకార్‌పేట ఎస్సై భవభూతిగా శ్రీవిష్ణు కనిపించాడు. ప్రతిసారి భవభూతిని చూపిస్తూ ఫ్లాష్ లో రాజాగా కనిపించే శ్రీవిష్ణును చూపించారు. భవభూతి మాత్రం పొట్టతో.. పెద్ద పళ్లతో కనిపించాడు. సడెన్ గా చూస్తే అది శ్రీవిష్ణు అని చెప్పడం కష్టమే.

ఇక వంశాలైనా, ఆస్తులైనా, ఆడ‌వాళ్లైనా మ‌గవాడినే అనుస‌రించాలంటూ రీతూవర్మతో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్ చూసాక ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా కనిపిస్తుందని, శ్రీవిష్ణు మరో హిట్ కొట్టేసినట్లే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News