Big Stories

Prabhas Comments: నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ రోల్ : ప్రభాస్

Prabhas Comments of Negative Role in Kalki: ‘కల్కి 2898AD’ సినిమాలో భైరవ పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయంటూ హీరో ప్రభాస్ చెప్పారు. మొదటిసారి ఇలాంటి పాత్ర చేస్తున్నానని, తన కెరీర్ లోనే ఇది బెస్ట్ రోల్ అంటూ.. మూవీ ఈవెంట్ లో ప్రభాస్ పేర్కొన్నారు. కాగా, ఆదివారం రోజు ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభమవ్వగా నిమిషాల వ్యవధిలోనే చాలా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి.

- Advertisement -

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశాపటనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను వైజయంతీ మూవీస్ విడుదల చేస్తోంది. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

- Advertisement -

Also Read: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో సమంత.. నిజమేనా ?

కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేస్తూ ఈ మూవీని తీర్చిద్దారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ కావడం ఖాయమంటూ మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, జనవరి తరువాత బాక్సాఫీస్ వద్ద చిత్రాలేవీ పెద్దగా సందడి చేయలేదు. వేసవి కాలమంతా చిన్న, మధ్యస్థాయి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘కల్కి’ వంటి విజువల్ వండర్ మూవీ వస్తుండడంతో భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News