Big Stories

Guess the Star Hero: నటి శారద పక్కన నిక్కర్ వేసుకొని కూర్చున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్!

Guess the Star Hero: ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి.. సెలబ్రిటీల పిల్లలు పుట్టినప్పటినుంచి పెరిగేవరకు ప్రతిది వైరల్ గా మారుతోంది. కానీ, అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు. అప్పుడు సెలబ్రిటీలు ఎక్కడకు వెళ్లినా పరిమితమైన మీడియా మాత్రమే ఉండేది. ఇక అప్పట్లో వారు ఏం చేసినా ఎక్కువ బయటకు వచ్చేది కాదు. ముఖ్యంగా ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు, వీడియోలు చూసినప్పుడల్లా ఎవరు వీరు అని గుర్తుపట్టలేకపోతున్నాం.

- Advertisement -

తాజాగా ఇలాంటి ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక స్టార్ హీరో మనవడు.. మరో స్టార్ హీరో కొడుకు.. ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ తన చిన్నప్పుడు ఇదుగో ఇలా ఒక కార్యక్రమంలో నిక్కర్ వేసుకొని కనిపించాడు. ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? కచ్చితంగా గుర్తుపడతారు.. అలా ఉంటుంది ఆ హీరో ఫ్యాన్ బేస్.

- Advertisement -

అవును.. మీరు గెస్ చేసింది కరెక్ట్. ఆ నిక్కర్ వేసుకున్న బాబు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు మనవడు.. హరికృష్ణ కుమారుడు.. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ అరుదైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: Anushka: దేవసేన అనుష్కకు వింత వ్యాధి..లాఫింగ్ డిజార్డర్ ఏంటో తెలుసా?

1997 లో అమెరికాలోని మాంచెస్టర్ లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ కార్యక్రమంలో ఇలా ఒక అతిధిగా విచ్చేశాడు. అయితే ఎవరితో వచ్చాడు అనేది తెలియదు. నటి శారద పక్కన కూర్చోని.. ఆమెతో ముచ్చటలు పెట్టాడు.

ఎన్టీఆర్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇక 1997 అంటే.. అప్పటికే బాల రామాయణంలో హీరోగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. 2001 లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు.

Also Read: Vijayashanti Birthday : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. పోలీస్ లుక్ లో ఏముంది బాసూ

ప్రస్తుతం ఎన్టీఆర్.. దేవర సినిమాతో బిజీగా మారాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా హిందీలో ఆర్ 2, తెలుగులో ఎన్టీఆర్ 31 సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News