Big Stories

Actress Mohini: చిరంజీవి చెల్లి.. బాలకృష్ణ ప్రేయసి.. గుర్తుపట్టారా ఈ చిన్నదాన్ని.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

Adithya 369 Movie Fame Actress Mohini: ఇప్పుడున్న హీరోయిన్లను గుర్తుపట్టడమే కష్టంగా ఉంది.. ఇక ఎప్పటి హీరోయిన్స్ ను ఏం గుర్తుపడతాం అని ఈ జనరేషన్ కుర్రాళ్ళు అంటే ఓకే కానీ.. 90 వ దశకంలో ఉన్న వాళ్లు ఈ హీరోయిన్ ను చూడగానే గుర్తుపడతారు. మరి అమ్మడు చేసినవి తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి తో నటించడం వలన ఒకటి.. ఆ రెండు సూపర్ హిట్లు అవ్వడం వలన ఇప్పటికీ ఈ హీరోయిన్ పేరు చెప్పగానే గుర్తుపట్టేస్తారు.

- Advertisement -

మరి ఎవరు ఆమె అనుకుంటున్నారా.. మోహిని. ఆదిత్య 369 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే టైమ్ ట్రావెల్ కథలు కామన్. కానీ, మొట్ట మొదటి టైమ్ ట్రావెల్ కథ అంటే ఆదిత్య 369 అనే చెప్పాలి.నందమూరి బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా మోహినికి బాగా పేరు వచ్చింది.

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత 1991లో ఈరమన రోజావే సినిమాతో కథానాయికగా కనిపించింది. ఆ తరువాత ఆదిత్య 369 సినిమా అవకాశం రావడం, అది బాగా హిట్ అందుకోవడంతో టాలీవు లోనే స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఈ చిన్నది తెలుగు మీద కన్నా తమిళ్, మలయాళ సినిమాలపై ఫోకస్ చేసింది. డిటెక్టివ్ నారద, మామ బాగున్నావా లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

Also Read: Sharanya: 10 th క్లాస్ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు

ఇక హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా, రాజేంద్ర ప్రసాద్ భార్యగా నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే భరత్ అనే వ్యక్తిని వివాహమాడి ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే కొన్నేళ్ల తరువాత భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకొని పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది.

మోహిని లైఫ్ లో కొన్ని చేదు సంఘటనలు జరిగినప్పుడు జీసెస్ ను నమ్ముకున్నానని, ఆయన వలనే బ్రతికి ఉన్నట్లు తెలిపిన ఆమె.. విదేశాల్లో క్రైస్తవ మత భోదకురాలిగా మారింది. ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు కనిపించడం తప్ప.. ఆమె ఇక సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేది లేదని తెలుస్తోంది. అప్పుడు సన్నగా, నాజూగ్గా ఉండే మోహిని.. ఇప్పుడు కొంచెం బొద్దుగా మారినా.. అందంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News