Big Stories

Anushka Shetty: స్వీటీకి అరుదైన వ్యాధి.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Anushka Shetty: టైటిల్ చూడగానే అమ్మో.. మా స్వీటీకి ఏమైంది.. ? ఏ వ్యాధి వచ్చింది అని కంగారుపడకండి. అదేమీ పెద్ద సీరియస్ వ్యాధి కాదు.. అరుదైన వ్యాధి . ఆమె ప్రతి చిన్నదానికి ఎక్కువ సేపు నవ్వుతూ ఉంటుందంట. అంటే.. నవ్వడం మొదలుపెడితే.. ఆపదు అని అర్ధం.

- Advertisement -

సాధారణంగా ఫ్రెండ్స్ జోక్ వేసినా, కామెడీ సీన్స్ చూసినా నవ్వుతాం. కానీ, స్వీటీ.. చిన్న చిన్న విషయాలకు కూడా నవ్వుతుందంట. అది కూడా ఆపకుండా నవ్వుతుందట. దాని వలన చాలా ఇబ్బందులు పడినట్లు స్వీటీ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

” నేను చిన్నదానికి నవ్వేస్తాను. అస్సలు నవ్వు ఆపుకోలేను. మినిమమ్ 15 నుంచి 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటాను.   ఎంత ట్రై చేసినా నవ్వు ఆపకుండా ఉండలేను.  షూటింగ్ సమయంలో, ముఖ్యంగా కామెడీ సీన్స్ చేసే సమయంలో నా వలనే లేట్ అవుతుంది. నేను నవ్వడం మొదలుపెడితే.. యూనిట్ మొత్తం బ్రేక్ తీసుకుంటారు. అంతలా నవ్వుతాను” అని చెప్పుకొచ్చింది.

ఇదొక వింత వ్యాధి అని తెలుస్తోంది. దీనివలన ఆమె ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదు. కొంతమంది ఎక్కువగా జోక్స్ విన్నప్పుడు నవ్వడం ఎంత సాధారణమో ఇది అంతే. కాకపోతే ప్రతి చిన్నదానికి స్వీటీ నవ్వుతూ ఉంటుంది. ప్రస్తుతం అనుష్క మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక స్వీటీ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక ప్రస్తుతం స్వీటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కన్నడ మూవీ చేస్తుండగా.. ఇంకొకటి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ అనే సిరీస్ లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో అనుష్క ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News