Big Stories

Deepika Rangaraju: బిగ్ బాస్ 8 కు బ్రహ్మముడి కావ్య.. అసలు నిజం చెప్పేసిందిగా

Deepika Rangaraju: బిగ్ బాస్ సీజన్ 8 మొదలుకానుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ 7 సీజన్స్ ను ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం తెల్సిందే. గత 5 సీజన్స్ గా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు 8 వ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ 7 లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ సీజన్ రసవత్తరంగా సాగడంతో సీజన్ 8 కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే సీజన్ 8 లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ వీరే అని ఒక లిస్ట్ కూడా చెప్పుకొచ్చారు. యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట. అలాగే నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు రావచ్చట.అంజలీ పావని, యాంకర్ శివ, నయని పావని, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేంద్రరెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబర్, ఫారిన్ లో సెటిలైన వ్లాగర్స్ లో ఒకరు ఉండనున్నారని చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

అయితే వీరితో పాటే మరో సీరియల్ నటి కూడా బిగ్ బాస్ కు వెళ్లనుందని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బ్రహ్మముడి సీరియల్ తో పేరు తెచ్చుకున్న దీపికా రంగరాజు. కోలీవుడ్ నుంచి వచ్చిన దీపికా.. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కావ్య పాత్రలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.

ఇక సీరియల్ లో ఎంత సీరియస్ గా ఉంటుందో షోస్ లలో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దీపికా షోకు వస్తుంది అంటే ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పొచ్చు. ఇక కావ్యపాత్రకే అందం తెచ్చిన ఆమె బిగ్ బాస్ కు వెళ్ళిపోతే బ్రహ్మముడి పరిస్థితి ఏంటి.. ? ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ను తీసుకొస్తారు.. ? అనే అనుమానాలు రేకెత్తాయి. అంతేనా బ్రహ్మముడి ఫ్యాన్స్ అయితే కావ్య వెళ్ళిపోతే ఎలా అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

ఇక వారందరికీ ఒక గుడ్ న్యూస్. బిగ్ బాస్ కు దీపికా వెళ్తుంది అన్న వార్తలో ఎటువంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చింది. సీరియల్ మానేసేది కూడా లేదని, ప్రస్తుతం తాను బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇలాంటి ఒక వార్త తనవద్దకు కూడా రాలేదని చెప్పిన దీపికా.. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయొద్దని కూడా తెలిపింది. దీంతో కావ్య ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక సీజన్ లోనైనా దీపికా బిగ్ బాస్ కు వెళ్తుందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News