Big Stories

Bollywood villains: తెలుగు సినిమాలకు విలన్‌గా మారిన హిందీ నటులు!

Bollywood Actors Entry to Tollywood Villains: బాలీవుడ్ నుంచి ఎంతోమంది నటులు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంతకుముందు హీరోయిన్స్ మాత్రమే ఎక్కువగా ఆసక్తి కనబర్చేవారు. కానీ ప్రస్తుం సీనియర్, జూనియర్ బాలీవుడ్ నటులు తెలుగులో విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ముందుకు వస్తున్నారు.

- Advertisement -

విలన్‌గా మారారా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్లు విలన్ పాత్రలు చేయడం లేదు. వీరి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. దీంతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై బాలీవుడ్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా విలన్ పాత్రలు చేసేందుకు బాలీవుడ్ నటులు ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కునాల్ కపూర్ ప్రత్యేకం..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న మూవీలో బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘వీరమాస్’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

సైఫ్ అలీఖాన్..
అక్కినేని నాగార్జున, ధనుష్‌లు కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ మూవీ ‘కుబేర’లో బాలీవుడ్ నటుడు జిమ్ సర్ప్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’లో సైఫ్ అలీఖాన్ ఓ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’లో సైప్ విలన్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంజయ్ దత్ నెగటివ్ రోల్..
టాలీవుడ్ పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో సంజయ్ దత్ నెగటివ్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ స్వీకెల్ ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ విల్ రోల్ చేస్తున్నారు.

‘గూఢచారి 2’లో ఇమ్రాన్ హష్మి..
అడవి శేష్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘గూఢచారి 2’ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో చేస్తున్నారు. దీంతోపాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఓజీ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మియే విలన్. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో మూవీ ‘ హరిహరవీరమల్లు’లో బాబీ డియోల్ లేదా అర్జున్ రాంపాల్‌లు విలన్ పాత్రలో నటిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Also Read: నటుడు అనుపమఖేర్ ఆఫీసు చోరీ, తలుపు బద్దలు కొట్టి మరీ..

బాలీవుడ్ నటులు డజన్ల కొద్దీ తెలుగులో విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న తెలుగు సినిమాలో హిందీతోపాటు కన్నడ, మలయాళం, తమిళ నటులను కీలక పాత్రలో తీసుకుంటున్నారు. ఇతర మార్కెట్లను సైతం దృష్టిలో ఉంచుకొని సినిమాలు వస్తుండడం..ఓటీటీకి ఆదరణ పెరగడంతో బాలీవుడ్ నటులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందులోనూ విలన్ల పాత్రలకు విపరీతంగా క్రేజీ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News