Big Stories

Anjali And Ananya: తెలుగు అమ్మాయిల బహిష్కరణ.. ఎందుకు.. ?

Anjali And Ananya: డిజిటల్ రంగం రోజురోజుకు దూసుకుపోతుంది. కొన్నేళ్లలో అసలు థియేటర్లు ఉంటాయా అనే అనుమానం కూడా వస్తుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ సైతం ఓటిటీ బాట పడుతున్నారు. ఇప్పటికే సగం మంది హీరోయిన్లు ఓటిటీలో నటిస్తూ మంచి గుర్తింపును అందుకున్నారు. అందులో తెలుగమ్మాయి అంజలి కూడా ఉంది. ఈ చిన్నది ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క సిరీస్ లతో బిజీగా మారింది.

- Advertisement -

ఇప్పటికే ఆమె నటించిన ఝాన్సీ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అంజలి మరో ఓటిటీ ప్రాజెక్ట్ ను అందుకుంది. అదే బహిష్కరణ. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తున్నాడు. నేడు అంజలి పుట్టినరోజు కావడంతో బహిష్కరణ నుంచి ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి మేకర్స్ విషెస్ తెలిపారు. పల్లెటూరు అమ్మాయిలా అంజలి కొడవలి పట్టుకొని రౌద్రంగా అరుస్తూ కనిపించగా.. పక్కన చైర్ తగలబడుతూ కనిపించింది.

- Advertisement -

గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల వలన ఆమె ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనేది కథగా తెలుస్తోంది. ఈ సిరీస్ లో మరో తెలుగమ్మాయి కూడా నటిస్తోంది. ఆమె అనన్య నాగళ్ల. ఆమెకు ఇదే మొదటి ఓటిటీ ఎంట్రీ. ఈరోజు ఆమె పుట్టినరోజు కూడా కావడంతో ఆమె పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లో అనన్య పాలు అమ్మే అమ్మాయిగా కనిపిస్తుందని తెలుస్తోంది.

పాల క్యాన్ పట్టుకొని నవ్వుతూ కనిపించింది. వీరితో పాటు ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్‌,శ్రీతేజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఇద్దరు తెలుగమ్మాయిల బహిష్కరణ ఏంటి.. ? ఎందుకు బహిష్కరించారు.. ? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News