Big Stories

Akkineni Nagarjuna on Kalki: ప్రభాస్ నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను.. కల్కి ట్రైలర్ పై నాగ్ ప్రశంసలు!

Akkineni Nagarjuna Comments on Kalki 2898 AD Movie: అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా కొన్ని కథలు కూడా వింటున్నాడు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. దానికి కూడా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే నాగ్.. సోషల్ మీడియాలో అంతా యాక్టివ్ గా ఉండడు. ఎప్పుడో బాగా వైరల్ అయినా విషయం మీద తప్ప అస్సలు స్పందించడు. అలాంటి నాగ్.. తాజాగా కల్కి ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా కల్కి సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

- Advertisement -

” ఏం ప్రపంచాన్ని సృష్టించారు నాగీ మీరు. మన భారతదేశపు అపురూపమైన కథలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాము. అమిత్ జీ ఫైర్, కమల్ జీ జస్ట్ వావ్.. ప్రయోగాలు చేసే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను ప్రభాస్. చివరగా, నా అభిమాన నిర్మాతలు అశ్విని దత్, స్వప్న మరియు స్వీటీకి శుభాకాంక్షలు. మీరు అద్భుతంగా నిర్మించారు. కల్కి సినిమాకు ఆల్ ది బెస్ట్.. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

నాగ్.. ఎప్పుడు సినిమాలు గురించి ఇలా మాట్లాడడం చూడలేదు.. అలాంటింది.. ఆయనే కల్కి గురించి ఈ రేంజ్ గా చెప్పాడంటే.. ఇక తిరుగు లేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD జూన్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సినిమా నుంచి రిలీజైన రెండు ట్రైలర్స్.. అంచనాలను ఆకాశానికి తాకేలా చేసాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్ లో చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.

Also Read: Samantha: బాలీవుడ్ స్టార్ హీరోతో సమంత రొమాన్స్.. నిజమేనా ?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News