Big Stories

Actor Akkineni Nagarjuna: క్షమాపణలు చెప్పిన అక్కినేని నాగార్జున.. మళ్లీ అలా జరగకుండా చూసుకుంటనంటూ..!

Akkineni Nagarjuna Apologies to Fans in Airport: అభిమాన హీరోలు సడెన్‌గా కనిపిస్తే.. ఎవరైనా చూడాలని, అవకాశం దొరికితే ఫొటో దిగాలని అనుకోవడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో సులువుగా అవకాశం లభిస్తుంది. కానీ ఒక్కోసారి సాహసాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి హీరోలే.. అభిమానుల దగ్గరకు వెళ్లి సెల్పీ దిగి ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమాన హీరోను కలిసే సమయాల్లో సెక్యూరిటీ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా, టాలీవుడ్ ప్రముఖ హీరో నాగార్జున విషయంలోనూ అదే జరిగింది. దీంతో ఆయనే స్వయంగా క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ అభిమానికి క్షమాణలు చెప్పారు. ఎయిర్ పోర్టులో నాగార్జున బయటకు వస్తున్న సమయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన ఓ అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఒక్కసారిగా పక్కకు నెట్టి వేయడంతో ఆ అభిమాని అదుపు తప్పి పడేవాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

‘ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సిందికాదు. నేను ఆయనకు క్షమాపణలు చెబుతున్నా. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా.’ అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నాగార్జున క్షమాపణలు చెప్పడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: నా అర్ధ నగ్న ఫోటోలను లీక్ చేశారు.. సెన్స్ లేదు వాళ్ళకి..

తమిళ స్టార్ హీరో ధునుష్ నటిస్తున్న మూవీలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా.. ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నాగార్జున, ధనుష్‌ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో రానుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News