Big Stories

Budh Gochar 2024: జూన్ 29 వరకు ఈ రాశుల వారు జాగ్రత్త.. రాజకీయాలైనా ఉద్యోగాలైనా అంతే సంగతి

Budh Gochar 2024: గ్రహాలకు రాకుమారుడుగా పిలువబడే బుధుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 29వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథునరాశిలో బుధుడు సంచరిస్తుండడం వల్ల అన్ని రాశులను ప్రభావితం చేయనుంది. కానీ ఇది కేవలం 4 రాశుల వారికి మాత్రమే కానుంది. 4 రాశుల వారికి కష్టకాలం ఏర్పడనుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. శత్రువులు వీరికి సమస్యలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు కూడా జరగవచ్చు. అయితే బుధ సంచారం వల్ల ఏ రాశి వారికి కష్టాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

- Advertisement -

కర్కాటక రాశి

- Advertisement -

కర్కాటక రాశి వారికి జూన్ 29 వరకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. దీని వల్ల ఇంట్లోని ఖజానా అంతా ఖాళీ అవుతుంది. కొంతమంది వీరి వద్ద డబ్బు తీసుకోవడానికి లేదా రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు తమ వద్ద ఉన్న డబ్బుతో అసలు సంతృప్తి చెందరు. అటువంటి పరిస్థితిలో నిజాయితీ లేని మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు పెద్ద నష్టాలకు దారి తీస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.

మకర రాశి

బుధుడి సంచారం మకరరాశి వారి జీవితంలో అనేక సవాళ్లను తెస్తుంది. అతి పెద్ద సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుంది. అనవసరమైన కోపం, దూకుడు ప్రవర్తన సంబంధాన్ని చెడగొట్టవచ్చు. కెరీర్‌లో సమస్యలను కలిగిస్తాయి. ఓపికతో పని చేయండి. గొడవలు మానుకోండి.

మీన రాశి

ఈ సమయంలో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. భాగస్వామిని అనుమానించకూడదు. ఈ సమయంలో రుణాలు తీసుకోవద్దు. ఎందుకంటే రుణం తీర్చడానికి చాలా సమయం పట్టవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News