Big Stories

Jyeshta Purnima: ఇవాళ ఈ ఆచారాలను పాటిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయట

Jyeshta Purnima: జ్యేష్ఠ పూర్ణిమ నాడు అంటే ఇవాళ హిందూమతంలో చాలా ప్రత్యేకమైన రోజు. హిందువులు అందరు పూర్ణిమ నాడు ఎంతో పవిత్రంగా పూజించే చంద్రుడికి చేసే పూజల వల్ల చాలా లాభాలు పొందుతారు. అంతేకాదు పూర్ణిమ రోజు చేసే పూజల కారణంగా సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది. అయితే పూర్ణిమ రోజు ఏం చేస్తే అనుకున్నవి ఫలిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

శుభ సమయం

- Advertisement -

ఈరోజు ఉదయం 6:01 గంటలకు జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం ప్రారంభమవుతుంది. తిరిగి జూన్ 22న ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. శుక్రవారం రోజున అంటే ఇవాళ పూర్ణిమను జరుపుకుంటారు. ఉసవాసంతో పూజ మొదలు పెట్టి తిరిగి శనివారం రోజున ఉపవాసం పూర్తి చేసి పూజను ముగిస్తారు.

ఉపవాసం ఉండాలనుకునే వారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం కొత్త దుస్తులను ధరించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ క్రమంలో సత్యనారాయణ స్వామిని కూడా పూజిస్తే శుభాలు కలుగుతాయి. వ్యక్తి గత జీవితంలో ఆనందం, సంపద, శ్రేయస్సు పొందుతారు. ఆర్థిక పరమైన కష్టాలు ఎదుర్కునే వారు ఈ రోజు చేసే పూజతో అన్నిటి నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఉదయాన్నే పూజ మొదలుపెట్టి తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేయాలి. అనంతరం పూర్ణిమ నియమాల ప్రకారం తులసి దేవి ఆరాధన కూడా చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి. మర్రి చెట్టు, అశ్వత్థామ చెట్లకు కూడా నీరు పోసి పూజించడం మూలంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చంద్ర దోషంతో ఇబ్బందులు ఎదుర్కునే వారు అయితే ఓం స్రం శ్రీం స్రౌం సః చంద్రమసే నమః…. ఓం శ్రీం శ్రీం శ్రౌం సః చంద్రమసాయ నమః అనే మంత్రాలన్ని జపించడం వల్ల చంద్ర దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News