Big Stories

Vastu Tips: ఈ వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో నుంచి దరిద్రం దెబ్బకు పరుగులు పెడుతుంది

Vastu Tips: హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలు పాటించకపోతే వాస్తు దోషం ఏర్పడి ఇంట్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హిందువులు నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రంలో, ఇంటి ప్రతి దిశ గురించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఇంట్లోని దరిద్రం వెంటనే తొలగిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1. బరువైన వస్తువులను ఉంచవద్దు

- Advertisement -

ఉత్తర దిక్కు లక్ష్మీ దేవి, కుబేరునికి సంబంధించినది అని శాస్త్రం చెబుతుంది. భారీ వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు దూరమై ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది.

2. పాదరక్షలు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఇంట్లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి.

3. మూసిన గోడ

ఇంటి ఉత్తర దిశలో మూసిన గోడ ఉంచకూడదు. ఈ దిశను డబ్బు వచ్చే దిశ అంటారు. ఈ దిశలో విండో లేదా తలుపును పెట్టుకుంటే మంచిది.

4. డస్ట్బిన్

డస్ట్‌బిన్‌ని ఇంటికి ఉత్తరం వైపు ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.

5. టాయిలెట్

పొరపాటున కూడా ఉత్తరం వైపు మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఈ దిశలో మరుగుదొడ్డి ఉండటం మంచిది కాదు. దీని కారణంగా దురదృష్టం వెంటాడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News