Big Stories

Yamaha RX 100: సరికొత్త‌గా యమహా RX 100.. పిచ్చెక్కిస్తున్న లుక్!

Yamaha RX 100 Big Update: 90’sలో పుట్టినవారైతే యమహా RX 100 బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలో బైక్ లుక్, ఇంజన్ సౌండ్ కుర్రకారు మనసును దోచుకుంది. యూత్‌‌కి ఈ బైక్ అంటే ఇప్పటికీ యమా క్రేజ్. ఈ బైక్‌పై క్రేజ్ ఎంతగా పెరిగిందంటే యమహా RX 100 యూత్‌లో ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. పాత రోజుల్లో తనదైన ముద్రవేసుకుంది. కంపెనీ RX 100 1985లో విడుదల చేసి కొన్ని కారణాల వల్ల ఉత్పత్తిని 1996లో క్లోజ్ చేశారు. దీంతో ఈ బైక్‌లు కనుమరుగుయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి బైక్‌ను కంపెనీ తీసుకురాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం యమహా RX 100 బైక్ లవర్స్‌ను మరింత ఉత్సాహపరుస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

తొంభైలలో ఫేమస్ బైక్ యమహా RX100 ప్రతి ఒక్కరికి గుర్తిండిపోయే బైక్. దాని అద్భుతమైన పర్ఫామెన్స్, పిక్-అప్ కారణంగా ఈ బైక్ దేశంలో బాగా పాపులర్ అయింది. ఇటీవల ఈ మోటార్‌సైకిల్‌ను మళ్లీ భారతదేశంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దాని లాంచ్ కష్టంగా మారింది. దీని గురించి యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా తన లాంచ్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి వెల్లడించారు.

- Advertisement -

Also Read:కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.40 వేల డిస్కౌంట్.. 187 కిమీ రేంజ్‌తో రఫ్పాడిస్తుంది!

RX100లో రింగ్-డింగ్-డింగ్ సౌండ్‌ట్రాక్ ఉంది. దీనికి మార్కెట్‌లో పిచ్చెక్కించే క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని తీసుకురావడం చాలా కష్టమైన పని. ఎందుకంటేఈ బైక్ ఇంతకుముందు 2 స్ట్రోక్ ఇంజన్‌తో వచ్చింది. ఇది కాలుష్యం కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కువగా అన్ని బైక్‌లు 4 స్ట్రోక్ ఇంజన్‌లతో వస్తున్నాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి. 4 స్ట్రోక్ ఇంజన్‌లతో ‘రింగ్-డింగ్-డింగ్’ సౌండ్‌ట్రాక్‌ను తీసుకురావడం అసాధ్యం.

RX100 లేటెస్ట్ అప్‌డేటెడ్ మోడల్ పాత బైక్‌ లుక్‌ను అందిస్తోంది. అయితే ఇంతకుముందు వచ్చే బరువులోనే దీన్ని తయారు చేయడం చాలా కష్టం. ఇషిన్ చిహానా ప్రకారం 100cc బైక్‌లు ఇప్పుడు కాలానిక తగ్గట్టుగా బెటర్ పర్ఫామెన్స్ అందించలేవు. బైక్ పనితీరును పెంచాలంటే కనీసం 200సీసీ ఇంజన్‌ను ఇందులో అమర్చాల్సి ఉంటుంది. దీని కారణంగా బైరక్ బరువు పెరుగుతుంది.

Also Read:100 కిమీ మైలేజీతో బజాజ్ కొత్త CNG బైక్.. జూలై 5న లాంచ్..!

ఈ బైక్‌ను త్వరలో విడుదల చేయవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ బైక్‌ను 2026 తర్వాత విడుదల చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే దీని తయారీలో ఎదురవుతున్న సమస్యలను చూస్తుంటే ఇది మార్కెట్ లోకి రావడానికి మరో 3 నుంచి 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. యమహా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News