EPAPER

Virat Kohli Car Collection: నిజంగానే ‘కింగ్’ కోహ్లీ.. ఆహా.. ఎన్నేసి కార్లు.. ఆ రేట్లేంటి బ్రో!

Virat Kohli Car Collection: నిజంగానే ‘కింగ్’ కోహ్లీ.. ఆహా.. ఎన్నేసి కార్లు.. ఆ రేట్లేంటి బ్రో!

Virat Kohli Car Collection: రోహిత్ శర్మ సారథ్యంలో 17 ఏళ్ల తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు భారీ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. T20 ప్రపంచ కప్‌లో చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో మాట్లాడాడు. అద్భుతమైన ప్రదర్శనతో స్కోరు బోర్డుకి 76 పరుగులు జోడించాడు. దీని కారణంగా భారత జట్టు స్కోరు 176 కి చేరుకుంది.


దీంతో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్ అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే అతడి వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజు మనం బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.

Range Rover
విరాట్ కోహ్లీ కార్ కలెక్షన్‌లో రేంజ్ రోవర్ ఎస్‌యూవీ కూడా ఉంది. ఆఫ్-రోడింగ్‌తో పాటు ఈ SUV అద్భుతమైన లగ్జరీకి కూడా ఫేమస్ అయింది. ఇందులో స్టాండర్డ్ వీల్‌బేస్ కాకుండా పొడవైన, ఏడు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా ఈ SUV 347 bhp పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్‌ను రిలీజ్ చేసే లీటర్ కెపాసిటి గల ఇంజన్‌ని ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్స్‌‌తో వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.93.55 లక్షలు.


Audi R8
నివేదికల ప్రకారం విరాట్ తన గ్యారేజ్‌లో ఆడి R8 కూడా ఉంది. ఇది చాలా పవర్‌ఫుల్ కారు. దాని లిమిటెడ్ ఎడిషన్ LMXని కోహ్లీ సొంతం చేసుకున్నాడు. అందులో ప్రపంచవ్యాప్తంగా 99 యూనిట్లు మాత్రమే సేల్ చేశారు. లేజర్ హై బీమ్ లైట్లను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి కారు ఇదే. ఇందులో 5.2 లీటర్ కెపాసిటీ గల V10 ఇంజన్ ఉంది. ఇది 562 హార్స్ పవర్, 540 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.72 కోట్లు.

Audi A8
ఆడి A8 విరాట్ కలెక్షన్స్‌లో చేర్చబడిన అత్యుత్తమ లగ్జరీ కారు. ఈ కారులో మూడు లీటర్ V6 మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 335 bhp పవర్ 500 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. 8 స్పీడ్ టిప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.34 కోట్లు.

Bentley Flying Spur
బాలివుడ్‌కి చెందిన చాలా మంది స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. అలానే ఈ క్రికెట్ ప్లేయర్ కూడా బెంట్లీ కారును ఎక్కువగా ఇష్టపడతాడు. బెంట్లీ అందిస్తున్న ఫ్లయింగ్ స్పర్ కూడా కోహ్లీ కలెక్షన్‌లో ఉంది. క్లాసిక్ డిజైన్‌తో వస్తున్న ఈ కారులో అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఇది కంపెనీకి చెందిన అత్యంత వేగవంతమైన ఫోర్ డోర్ సెడాన్ కారు. ఇది రెండు ఇంజన్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఇది గంటకు 285 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.25 కోట్లు.

Bentley Continental GT
విరాట్‌కి ఇష్టమైన కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT కూడా ఒకటి. అద్భుతమైన ఫీచర్లతో పవర్‌ఫుల్ ఇంజన్ కలిగి ఉంటుంది ఈ లగ్జరీ కారు. ఇది నాలుగు లీటర్ V8, ఆరు లీటర్ V12 ఇంజన్‌లతో వస్తుంది. ఇది గంటకు 318 కిలోమీటర్ల నుంచి గంటకు 336 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.23 కోట్లు.

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×