Big Stories

Maruti Suzuki Fronx Velocity Edition: ఫ్రాంక్స్​ సరికొత్త ఎడిషన్​ లాంచ్​.. స్పెసిఫికేషన్స్ అదుర్స్..!

Maruti Suzuki Fronx Velocity Edition: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో మార్కెట్‌లో కొన్నేళ్లుగా తన ఆదిపత్యాన్ని చెలాయిస్తూ వస్తుంది. కొత్త కొత్త ఎడిషన్లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా మరొక కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ మారుతి సుజుకి ఫాంక్స్‌కి కొత్త ఎడిషన్‌ని తీసుకొచ్చింది. ‘ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్‌’ పేరుతో సరికొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఫ్రాక్స్ వెలాసిటీ ఇప్పుడు మరో రెండు ఆప్షన్లలో కూడా వచ్చింది. అవి ఒకటి నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

ఈ ఫ్రాంక్స్ వెలాసిటీ రూ.7.29 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ వెర్షన్ల కంటే మరిన్ని యాక్ససరీలను పొందుతుంది. ఫ్రాంక్స్ 1.2 సిగ్మా వెలాసిటీ ఫ్రంట్ బంపర్, వీల్ ఆర్చ్‌లు, హెడ్ ల్యాంప్‌లను కలిగి ఉంది. అలాగే ఫ్రాంక్స్ డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ) వెలాసిటీ సైడ్ మౌల్టింగ్‌తో పాటు రెడ్ కలర్ ఫినిష్ డిజైనర్ ఫ్లోర్ మ్యాట్లతో వస్తాయి.

- Advertisement -

Also Read: సేఫ్టీ ముఖ్యం బిగులు.. ఫ్యామిలీ కోసం బెస్ట్ కార్లు ఇవే!

1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లలో డెల్టా ప్లస్ వెలాసిటీ లోయర్ ట్రిమ్స్ నుంచి ప్రతి గార్నిష్ ఎలిమెంట్స్ పొందుతుంది. అలాగే 3డీ బూట్ మ్యాట్, నెక్స్‌క్రాస్ బ్లాక్ ఫినిష్ సీట్ కవర్, కార్బన్ ఫినిష్ ఇంటీరియర్ స్టైలింగగ్ కిట్ వంటి యాక్ససరీలు ఇందులో ఉన్నాయి. మరిన్ని వేరియంట్లు కూడా విభిన్న యాక్ససరీలను పొందుతాయి. ఇక దీని స్పెసిఫికేషన్ల వివరాలకొస్తే.. 5 స్పీడ్ మాన్యువల్, AMTతో యాడ్ చేసిన ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు.

అంతేకాకుండా 5స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేసి స్మార్ట్ హైబ్రిడ్ టెక్రాలజీతో అద్భుతమైన పవర్ ప్యాక్ చేసిన 1.0 లీటర్ బూస్టర్ జెట్‌ను అందించి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇవికాకుండా 1.2 లీటర్ CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఒక కిలోకి 28.51 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, యాపిల్ కార్‌ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News