Big Stories

Mahindra Thar 5 Door Launch: మహీంద్రా నుంచి థార్ 5 డోర్ మోడల్ వచ్చేస్తుంది.. డిజైన్ అదుర్స్.. లాంచ్ డేట్ ఇదే..!

Mahindra Thar 5 Door Launch Date in India: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వాహన ప్రియులను అట్రాక్ట్ చేసేందుకు కంపెనీ కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కంపెనీ మరొక కొత్త మోడల్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సారి మహీంద్రా థార్ 5 డోర్ వేరియంట్‌లో రాబోతుంది.

- Advertisement -

దీనికి ‘థార్ అర్మాడా’ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ 5డోర్ల కార్ ఈ ఏడాది ఆగస్టు 15న గ్రాండ్‌గా లాంచ్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. మహీంద్రా థార్ అర్మాడా మోడల్ టెస్ట్ డ్రైవ్‌లో ఉన్న ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

దాని ప్రకారం.. 5డోర్ లే-అవుట్‌ని కంపెనీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా రేర్ ప్యాసింజర్లకు స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ మోడల్ అద్భుతమైన లుక్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రొజెక్టర్ సెటప్‌లతో కూడిన సర్క్యులర్ LED హెడ్‌లైట్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

Also Read: మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

అలాగే ఫాగ్ ల్యాంప్‌లు, సిగ్నేచర్ ఫెండర్-మౌంటెడ్ మార్కర్ లైట్లు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. దీని ఓవర్ లుక్ మరింత బోల్డ్‌గా.. అగ్రెసివ్‌గా ఉంటుందని సమాచారం. అలాగే దీని అల్లాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్‌తో వస్తాయని అంటున్నారు. ఇవి 18 ఇంచ్ సైజ్‌తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో అద్భుతమైన క్యాబిన్ సౌకర్యం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉండనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

అంతేకాకుండా దీని టాప్ ఎండ్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ అందించారని తెలుస్తోంది. దీని ద్వారా ఈ సిగ్మెంట్‌లో కంపెనీ మరొక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. దీని కారణంగా మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ భారత మార్కెట్‌లో సన్‌రూఫ్ కలిగిన ఒకే ఒక్క ల్యాడర్ ఫ్రేమ్ SUVగా నిలిపోనుంది. ఇది 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ వంటి వేరియంట్‌లో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు లాంచ్ సమయం నాటికి వెల్లడవనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News