Big Stories

iVOOMi S1 Lite Launched: రూ.1,499లకే EV.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ టైమ్‌కే ఫుల్ ఛార్జ్!

iVOOMi S1 Lite Launched: భారతదేశపు అత్యంత చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 లైట్‌ను ద్విచక్ర వాహన సంస్థ iVOOM విడుదల చేసింది. ఇది పెరల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ వంటి 6 కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది. మీరు కంపెనీ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయవచ్చు. మీరు S1 లైట్‌ని రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. గ్రాఫేన్ అయాన్, లిథియం అయాన్. గ్రాఫేన్ అయాన్ వేరియంట్ ధర రూ.54,999, లిథియం అయాన్ ధర రూ.64,999.

- Advertisement -

iVOOMi S1 Lite గ్రాఫేన్ అయాన్ ఒకే ఛార్జ్‌పై 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ రియల్ రేంజ్ ఇస్తోంది.  లిథియం అయాన్ ఒకే ఛార్జ్‌పై 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం సులభమైన EMI ఎంపికను కూడా తీసుకొచ్చింది. దీని కారణంగా మీరు నెలవారీ EMI రూ. 1,499తో కొనుగోలు చేయవచ్చు. భారతీయ మార్కెట్లో కంపెనీ 10,000 కంటే ఎక్కువ ఈ-స్కూటర్లను విక్రయిస్తుంది.

- Advertisement -

Also Read: CSD క్యాంటీన్లలో హ్యుందాయ్ వెర్నా.. తక్కువ ధరకే దక్కించుకోవచ్చు!

iVOOMi S1 Lite ఈ స్కూటర్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే.. ఇది ERW 1 గ్రేడ్ ఛాసిస్‌తో తయారయింది. ఇది 170mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. S1 లైట్ 18 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. ఇది మీ అన్ని అవసరాలకు తగినంత స్థలాన్ని ఇస్తుంది. స్కూటర్లలో మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ (5V, 1A), LED డిస్‌ప్లే స్పీడోమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 7 స్థాయి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

iVOOMi S1 Lite ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన బ్యాటరీ టెక్నాలజీని అందిస్తుంది. ఇది వెయిట్‌లెస్ ఛార్జర్, IP67 బ్యాటరీతో వస్తుంది. ఇది బ్యారటీ కెపాసిటీని పెంచుతుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, సులభంగా తొలగించవచ్చు. అలానే ఛార్జింగ్ కూడా ఈజీగా పెట్టొచ్చు. గ్రాఫేన్ వేరియంట్ గరిష్ట వేగం 45 kmph, లిథియం వేరియంట్ 55 kmph. గ్రాఫేన్ వేరియంట్ 3 గంటల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. అయితే లిథియం వేరియంట్ కేవలం 1.5 గంటల్లో 50 శాతం ఛార్జ్ చేయబడుతుంది. సుమారు 3 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Also Read: మారుతి నుంచి కొత్త డిజైర్.. మైలేజ్ 31కిమీ కంటే ఎక్కువే!

అంతే కాకుండా కంపెనీ iVOOMi S1 సిరీస్‌లో S1, S1 2.0 అనే రెండు వేరియంట్‌లను విక్రయిస్తోంది. ఇది అధిక సామర్థ్యం గల Li-ion బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉన్నాయి. దీని ధర రూ.74,999. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. గంటకు 58 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO అశ్విన్ భండారీ మాట్లాడుతూ iVOOMiలో మా లక్ష్యం ఎల్లప్పుడూ మా కస్టమర్ల విభిన్న అవసరాలను తీర్చడమే. ఇందులో సరసమైన ఆవిష్కరణలు ఉంటాయని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News