Big Stories

FMCG Companies Price Increased: జేబుకు చిల్లు.. సబ్బులతోపాటు మరికొన్ని వస్తువుల ధరల పెంపు..!

FMCG Companies Price Increased: కామన్‌మేన్ జేబుకు చిల్లు పడుతుందా? కుటుంబంలో నెల వారీ వ్యయం పెరగబోతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కొన్ని వస్తువుల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -

సబ్బులు, షాంపూలు, ఫుడ్‌కి సంబంధించి కొన్ని సెలక్ట్ ఫుడ్ ఐటమ్స్, నెస్లే కాఫీ, మ్యాగీ న్యూడిల్స్, ఓట్స్ వంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి. మరి కొన్ని కంపెనీలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వున్నట్లుండి ధరల పెరుగుదల వెనుక కారణమేంటన్న చర్చ సామాన్యుల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యం గా ఉత్పత్తులకు కావాల్సిన ముడి పదార్ధాల ధరలు పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నాయి కంపెనీలు.

- Advertisement -

సబ్బులు, బాడీ వాష్ ధరలు 2 నుంచి 9 శాతం, హెయిర్ సంరక్షణ నూనెలు 8 నుంచి 11 శాతం, డోవ్ సబ్బులైతే రెండుశాతం పెరగనున్నాయి. ఇవేకాకుండా ఎంపిక చేసిన కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవి 3 నుంచి 17 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. హల్ షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలైతే 4 శాతం, మ్యాగీ ఓట్స్, నూడుల్స్ 17 శాతం, డాబర్ ఇండియా 1 నుంచి 5 వరకు, బికాజీ ఉత్పత్తులు 2 నుంచి 4 శాతం జాబితాలో ఉన్నాయి.

Also Read: ఇచ్చిపడేశాడు బ్రో.. ఈ కార్లపై ఊహకందని తగ్గింపు.. కొద్ది రోజులే..!

2022, 2023 ప్రారంభంలో కమొడిటీ ధరలు పెరిగాయని, ఈ క్రమంలో కొంత భారాన్ని వినియోగదారుల పైకి సంబంధిత కంపెనీ నెట్టేశాయి. గతేడాది కంటే ముడి చమురు, పామాయిల్ ధరలు తగ్గినా పాలు, పంచదార, కాఫీ వంటి ముడి పదార్ధాల ధరలు పెరగడమే ఉత్పత్తుల ధరల పెంపునకు కారణంగా చెబుతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయని, రాబడి అంతంత మాత్రమేగానే ఉందని అంటున్నారు. ఇలాగైతే ఏదీ కొనుక్కొని తినే పరిస్థితి ఉండదని సగటు సామాన్యులు పెదవి విరుస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News