Big Stories

Citroen C3 Aircross Plus: బుర్రపాడు.. కారుపై రూ.2.62 లక్షల భారీ తగ్గింపు..!

Citroen C3 Aircross Plus Price Dropped up t Rs 2.62 Lakhs: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ భారత మార్కెట్‌‌లో ఇటీవలే ధోనీ ఎడిషన్ సి3 ఎయిర్ క్రాస్‌ను రిలీజ్ చేసింది. ఇది భారత మార్కెట్‌లో రూ.11.82 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మోడల్‌లో ఓ వేరియంట్‌పై కంపెనీ కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను ప్రకటించింది. సి3 ఎయిర్‌క్రాస్ మిడ్ స్పెక్ ప్లస్ వేరియంట్‌పై సిట్రోయెన్ కంపెనీ ఏకంగా రూ.2.62 లక్షల తగ్గింపును పొందొచ్చు.

- Advertisement -

యూ, ప్లస్, మాక్స్, వేరియంట్‌లలో లభించే సి3 ఎయిర్‌క్రాస్ పరిమిత యూనిట్లపై మాత్రమే ఈ తగ్గింపు లభిస్తుంది. దీనికంటే ముందు మిడ్ స్పెక్ ప్లస్ ట్రిమ్ రూ.11.61 లక్షలతో అందుబాటులో ఉండగా.. డిస్కౌంట్ తర్వాత సి3 ఎయిర్‌క్రాస్ ప్లస్ రూ.8.99 లక్షలకు అందుబాటులో ఉంది.

- Advertisement -

ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారు 5,7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందించబడింది. ఈ సి3 ఎయిర్‌క్రాస్ ప్లస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందింది. అలాగే మై సిట్రోయెన్ కనెక్ట్ యాప్, రిమోట్ కీలెస్‌తో అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌లో ఈ ఎడిషన్‌ 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 26 కి.మీ మైలేజీతో బెస్ట్ కారు ఇదే..!

ఇందులో సేఫ్టీ సూట్‌లో ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ వ్యూ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌తో సహా మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంజిన్ పనితీరు విషయానికొస్తే.. ఈ సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటివి ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News