Big Stories

Unlimited Prepaid Data Plan: రూ.9 కే 10జీబీ డేటా.. రూ.18లకి 20 జీబీ.. ఈ సిమ్ కార్డు ఉన్న వారికి పండగే పండగ.. కానీ!

Airtel Rs 9 unlimited prepaid data plan: ప్రస్తుతం టెలీకాం రంగంలో అత్యంత స్పీడుగా దూసుకుపోతుంది భారతీ ఎయిర్‌టెల్. కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తూ మరింత మందికి చేరువవుతోంది. తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లతో వచ్చి తమ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రకరకాల ఆఫర్లను అందించిన ఎయిర్‌టెల్ తాజాగా మరొక అద్భుతమైన, కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే కేవలం రూ.9ల ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ ద్వారా మీరు రూ.9లతో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా ఊహించని భారీ డేటాను పొందుతారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

- Advertisement -

ఎయిర్‌టెల్ కస్టమర్లు కేవలం రూ.9లతో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 10 జీబీ డేటా పొందుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ డేటా కేవలం ఒక గంటలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. గంట సమయం దాటిన తర్వాత డేటా స్పీడ్ తగ్గిపోతుంది. అయితే అందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండక పోవచ్చు. కొంతమందికి మాత్రమే లభించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Also Read: భారతీయులకు ఇష్టమైన బైకులు ఇవే.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు!

ఆ రీఛార్జ్ చేసుకున్న సమయంలో 10జీబీ హైస్పీడ్ డేటా పొందుతారు. ఆ తర్వాత డేటా అయిపోయాక కేవలం 64 కెబిపిఎస్‌కి తగ్గిపోతుంది. కాగా ఈ డేటా ఎలాంటి వారికి యూజ్ అవుతుందంటే.. వెంట వెంటనే పెద్ద పెద్ద ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకునేవారికి ఇది చాలా బెస్ట్ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటేంటే.. ప్రస్తుతం మనకు 10జీబీ డేటా కావాలంటే ఏ సిమ్ కార్డు నుంచి అయినా రూ.100 రీఛార్జ్ చేస్తే కానీ ఈ డేటా లభించదు. కానీ ఎయిర్‌టెల్ మాత్రం మరింత మందికి చేరేందుకు ఈ గొప్ప రీఛార్జ్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది.

అయితే ఇదే ప్లాన్‌లో రెండు వోచర్లను కొనుక్కుంటే.. అప్పుడు రూ.18లతో 20జీబీ డేటా పొందవచ్చు. అతి తక్కువ సమయంలో అధిక డేటా కావాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News