Big Stories

Bank Holidays July 2024: అమ్మో ఇన్ని రోజులా.. జులై బ్యాంక్ హాలిడేస్ లిస్టు.. ఏకంగా 12 రోజులు బ్యాంకింగ్ బంద్!

Bank Holidays July 2024: ప్రాంతీయ సెలవులు, వారాంతపు మూసివేత కారణంగా ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 12 రోజులు మూసివేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంవత్సరానికి సంబంధించిన పూర్తి బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం జులై నెలలోని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతో సహా 12 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. ఎప్పటిలాగే బ్యాంకులు మొదటి, మూడవ శనివారాల్లో పనిచేస్తాయి.

- Advertisement -

12 రోజులు బ్యాంకులు మూసివేసినా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం పనిచేస్తాయి. కస్టమర్‌లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

అయితే, పని చేయని తేదీలను పరిగణనలోకి తీసుకుని, బ్యాంకు శాఖల సందర్శనల విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అధికారులను కస్టమర్‌లను కోరుతున్నారు.

వారాంతపు సెలవులు కాకుండా బ్యాంకలు మూసివేయనున్న రోజులు జులై 3,6,8,9,16,17. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొహర్రం కారణంగా జులై 17న మూసివేయనున్నారు.

జులై 3న మేఘాలయలో బ్యాంకులకు సెలవు కాగా మిజోరాంలో జులై 6, మణిపూర్‌లో జులై 8, సిక్కింలో జులై 9, ఉత్తరాఖాండ్‌లో జులై 16న బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ.

Also Read: ITR Filing 2024: ఐటీఆర్ ఫైల్స్‌ చేస్తున్నారా? అయితే ఈ పది రూల్స్ పాటిస్తే డబ్బు ఆదా!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను నిర్ణయిస్తుంది, జాతీయ/రాష్ట్ర సెలవులు, సాంస్కృతిక లేదా మతపరమైన ఆచారాలు, కార్యాచరణ అవసరాలకు సంబంధించిన లెక్కలను దృష్టిలో ఉంచుకుని సెలవులను నిర్ణయిస్తుంది. ఆర్థిక సంస్థలలో పారదర్శకత, సమన్వయాన్ని నిర్ధారిస్తూ, సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను ఆర్బీఐ అధికారిక మార్గాల ద్వారా ప్రచారం చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News