Big Stories

Telugu States Politics: టీడీపీకి.. వైసీపీ, బీఆర్ఎస్‌కి ఇదే తేడా!

Telugu States Politics Difference Between TDP YCP BRS Parties: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ప్రతిపక్షానికే పరిమితమైన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి కారణాలు, దారులు వెతుక్కుంటారు. గతంలో అధికారం అనుభవించిన పార్టీలను తిట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల్లోకి జంప్ అయిపోతారు. వైసీపీ, బీఆర్ఎస్ విషయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఒకరిద్దరు సహజంగా పార్టీలు మారుతారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే పార్టీని వీడారు. మిగిలిన వారంతా కేసీఆర్ తోనే ఉన్నారు.

- Advertisement -

ఇక వైసీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. ఇంకా ఫిరాయింపులు మొదలుకాలేదు. అంటే.. పరిస్థితులు మరీ చేతులు దాటిపోయేలా లేవు. కానీ.. బీఆర్ఎస్, వైసీపీ భవిష్యత్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం పార్టీ ఫిరాయింపులో, నేతలు కండువాలు మార్చేస్తారనో కాదు. ఆ పార్టీల అధినేతలు పార్టీ నిర్మాణం విషయంలో చేసిన పొరపాట్లు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పార్టీ బలంగా ఉండేలా కేసీఆర్, జగన్ పార్టీలను నిర్మించలేదు. కేవలం అధికారంలో ఉన్నపుడు హంగులు మాత్రమే అద్దారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ హంగులన్ని రాలిపోతున్నాయి.

- Advertisement -

తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులను పార్టీలో చేర్చుకుంది. 2014 కంటే ముందు కొన్ని జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం బలం లేదు. అలాంటి దగ్గర టీడీపీ నేతలతో ఆ గ్యాప్ నింపుకుంది. అంటే ఇతర పార్టీ నాయకులను తమలో కలుపుకుందే తప్పా.. సొంతగా పార్టీ క్యాడర్ ను తయారు చేసుకోలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ నేతలు కూడా కేసీఆర్ తో కలిశారు. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్లంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలకు వైసీపీ ఓ వేదికగా కనిపించింది. జగన్ కూడా ఇదే మంచి అవకాశంగా భావించి వచ్చినవారికి వైసీపీ కండువా కప్పేశారు.

దీంతో పార్టీ నిర్మాణం అయిపోయిందని అనుకున్నారే తప్పా.. ఇదే భవిష్యత్‌లో తనకు ప్రమాదంగా మారుతందని అంచనా వేయలేదు. రేపటి రోజున ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని కొంచెం నమ్మకం కలిగినా.. వైసీపీ నేతలంతా హస్తం గూటికి చేరిపోవడం ఖాయం. ఇప్పుటికే అదే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వచ్చినట్టు అయితే.. వైసీపీ, బీఆర్ఎస్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది. టీడీపీని చంద్రబాబు బలంగా నిర్మించారు. అందుకే.. 70శాతానికి మించి టీడీపీ ఎమ్మెల్యేల రాజకీయ ప్రస్థానం ఆ పార్టీ నుంచి మొదలవుతుంది.

Also Read: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్..

అంటే.. టీడీపీ స్కూల్‌ల్లోనే వాళ్లు ఓనమాలు దిద్దారు. అలాంటి వారు ఒకరిద్దరు పార్టీని వీడి వెళ్లిపోయినా.. మెజారిటీ నేతలు ఉంటారు. అందుకే.. 2004, 2009లో ఓడిపోయినా మళ్లీ 2014లో టీడీపీ గెలిచింది. 2019లో ఓడిపోయినా 2024లో మళ్లీ గెలిచింది. కింజరాపు ఫ్యామిలీ, విజయనగరం రాజులు లాంటి వారు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బచ్చయ్య చౌదరి ఇలాంటి వారంతా టీడీపీలోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అందుకే అంత ఈజీగా పార్టీ మారరు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎన్ని ప్రలోభాలు ఎదురైనా టీడీపీతోనే ఉంటారు. ఎందుకంటే వారి పుట్టుక అక్కడే మొదలైంది. పార్టీ నిర్మాణం బలంగా ఉంటే.. నేతలు అంటిపెట్టుకొని ఉంటారు. కానీ, బీఆర్ఎస్, వైసీపీ మాత్రం ఇతర పార్టీల నుంచి నాయకులను ఇంపోర్టు చేసుకుంది. అధికారం కోసం వచ్చిన నేతలు.. అధికారం పోతే వెళ్లిపోతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News