EPAPER

Pongal Train Tickets Reservation: హాట్ కేకుల్లా సంక్రాంతి ట్రైన్ టికెట్స్.. నిమిషాల్లో రిజర్వేషన్ క్లోజ్!

Pongal Train Tickets Reservation: హాట్ కేకుల్లా సంక్రాంతి ట్రైన్ టికెట్స్.. నిమిషాల్లో రిజర్వేషన్ క్లోజ్!

Pongal Train Tickets Reservation| సంక్రాంతి పండుగంటే అందరూ కుటుంబసమేతంగా జరుపుకునే వేడుక. ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు వెళ్లాలని ఆత్రుత ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. ప్రయాణం చేయడానికి అసలు టికెట్లు దొరకవు. గ్రామాల్లో పండుగ సంబరాలు జోరుగా సాగుతాయి కాబట్టి.. అందరూ వెళ్లాలని ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. లేకుంటే చివరి నిమిషంలో ఎక్కడ లేని ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకే రైల్వే శాఖ పండక్కి నాలుగు నెలల ముందుగానే రిజర్వేషన్ మొదలెపెట్టేసింది.


హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారు సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు గనుక.. రైల్వే శాఖ రిజర్వేషన్ ప్రారంభించింది. కానీ ఆ టికెట్స్ కూడా ఇప్పుడు అంత సులువుగా దొరకని పరిస్థితి. రిజర్వేషన్ మొదలు కాగానే నిమిషాల్లో టికెట్స్ అయిపోతున్నాయి. ఇంకా దసరా పండుగ కూడా రాకముందే జనాలు సంక్రాంతి ట్రైన్ టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన విడాకుల మహిళ


సంక్రాంతి 2025 పండుగకు దక్షిణ మధ్య రైల్లవే సెప్టెంబర్ 12 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టింది. ఉదయం 8 గంటల ప్రారంభమైన రిజర్వేషన్ కేవలం 5 నిమిషాల్లోనే క్లోజ్ అయిపోయింది. టికెట్లన్న హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరే గోదావరి, కోణార్క్, ఫలక్ నుమా, విశాఖ మొదలైన రైళ్లల్లో సీట్లు ఖాళీగా లేవు. ఇంకా కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ చూపిస్తోంది. అందుకే సంక్రాంతి పండుగ ఊరికి చేరుకోవాలంటే ఇప్పిటి నుంచే ప్రత్యామ్నాయం మార్గాలు చూసుకోవడం ఉత్తమం. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 6 లక్షల మంది తమ సొంతూళ్లకు ప్రయాణం చేస్తుంటారని సమాచారం.

రైలు ప్రయాణం కోసం సంక్రాంతి అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్స్ లభించే తేదీలు ఇవే

సెప్టెంబర్ 13 2024 – జనవరి 11, 2025 (శనివారం)

సెప్టెంబర్ 14 2024 – జనవరి 12 2025 (ఆదివారం)

సెప్టెంబర్ 15  2024 – జనవరి 13 2025 (సోమవారం)

సెప్టెంబర్ 16 2024 – జనవరి 14 2025 (మంగళవారం)

సెప్టెంబర్ 17 2024 – జనవరి 15 2025 (బుధవారం)

సెప్టెంబర్ 18 2024 – జనవరి 16 2025 (గురువారం)

సెప్టెంబర్ 19 2024  – జనవరి 17 2025 (శుక్రవారం).

Related News

Mumbai actress case: కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

Big Stories

×