Big Stories

Deputy CM Pawan Kalyan: కొండగట్టుకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన ఫిక్స్!

Date and Time fixed for Deputy CM Pawan Kalyan Kondagattu Visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

- Advertisement -

పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు.11 రోజుల పాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. వారాహి దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతేడాది కూడ పవన్ కల్యాణ్ ఇదే దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజేయ స్వామి ఆలయానికి వచ్చారు. అలాగే ఎన్నికల ప్రచార రథమైన వారాహికి పూజలు చేయించారు. అనంతరం ఇక్కడినుంచి వారాహి యాత్రను కొనసాగించారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.

Also Read: జగన్ ప్రతిపక్షానికి నాయకుడు మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదు : మంత్రి పయ్యావుల

కొండగట్టు ఆంజనేయుడి దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారుజ జులై 1వ తేదీన పిఠాపురం ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం అదే రోజు వారాహి సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News