Big Stories

Pawan Kalyan Varahi Ammavari Deeksha: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్.. 11 రోజులు ఎందుకంటే..?

Pawan Kalyan Varahi Ammavari Deeksha: వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలామంది తెలుసు.  దేవి భక్తులకు దీని గురించి చెప్పనక్కర్లేదు. చాలామందికి ఈ తరహా దీక్ష ఉందని తెలీదు కూడా. ఇప్పుడు ఈ దీక్ష సిద్ధమవుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. బుధవారం నుంచి 11 రోజులపాటు అమ్మవారి దీక్షలో నిమగ్నం కానున్నారు. ఇంతకీ ఈ దీక్ష ఉద్దేశం ఏంటి? ఎందుకు 11 రోజులు మాత్రమే చేస్తారు? వారాహి అంటే ఎవరు ఇలా డీటేల్స్‌లోకి వెళ్దాం.

- Advertisement -

గత ఎన్నికల్లో వారాహి పేరిట యాత్ర చేశారు పవన్ కల్యాణ్. అప్పట్లో దీక్ష కూడా చేశారు. జూన్ 26 నుంచి డిప్యూటీ సీఎం పవన్ మరోసారి వారాహి అమ్మవారు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఇంతకీ ఈ దీక్ష విశేషం ఏంటి? ఎందుకు చేస్తారనేది అసలు సందేహం. అక్కడికే వచ్చేద్దాం.

- Advertisement -

గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ అమ్మవారికి మొక్కుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దీక్షకు డిప్యూటీ సీఎం సిద్ధమైనట్టు చెబుతున్నారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి. శత్రు భయం ఉండ కూడదని దేవి భక్తులు ఆమెని ఆరాధిస్తారు. శత్రువులను జయించడం, జీవితంలో స్థిరత్వం రావడం, అరిషడ్వర్గాల నుంచి తన మనసును ఆధీనంలో ఉంచుకోవడం దీక్షలో కీలకమైనవి. ఇందుకోసం అమ్మవారి దీక్ష చేపడతారు.

Also Read: Jagan @ Yelahanka Palace: జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి..?

వారాహి అమ్మవారి దీక్ష జేష్ట్య మాసం చివర ఆషాడ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల మాదిరిగానే ప్రతిరోజూ తల స్నానం, మెడలో ఓ కండువా, చెప్పులు లేకుండా నడవడం, నేలపై నిద్రపోవడం, అమ్మ వారికి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తారు. పాలు, పండ్లు తీసుకుంటారు. నవరాత్రి దీక్ష మాదిరిగానే తొమ్మిది రోజులు. కాకపోతే కొంతమంది 11 రోజులు చేస్తారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవాలని బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షలో నిమగ్నమవుతు న్నారు. మన దేశంలో వారణాసి, ఒడిషాల్లో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు కొలువుతీరాయి.

Also Read: మరో వివాదంలో జగన్, దాదాపు రూ. 296 కోట్లు

పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతి రూపాలుగా సప్త మాత్తృకలుంటారు. వారిలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధ కాసురుడు, రక్త బీజుడు, శుంభనిశుంభు వంటి రాక్షసులను సంహరించడంతో వారాహి అమ్మవారి ప్రస్తావన కీలకం. అమ్మవారు రూపం వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News