Big Stories

Ganja Trafficking in AP: టార్గెట్ 100 రోజులు.. గంజాయి దందాపై సీఎం యాక్షన్ ప్లాన్..!

CM Chandrababu Naidu Action Plan on Ganja Trafficking: గంజాయి అత్యధికంగా వినియోగం, రవాణా అవుతున్న పిన్ ఏరియా ఏదంటే తిరుపతి పేరే చెప్తున్నారు పోలీసులు.. గత అయిదేళ్లు ఈ ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి రావాణా కేంద్రంగా మార్చేశారు స్మగ్లర్లు.. స్థానికంగా కూడా గల్లిగల్లీలో గంజాయి విక్రమాలు పెంచేసి దాని వినియోగాన్ని విపరీతంగా పెంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వందరోజులలో తిరుపతిలో గంజాయి లేకుండా చేస్తామంటున్న ప్రభుత్వం సక్సెస్ అవుతుందా?

- Advertisement -

గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి అక్రమ దందా పెరిగిన ప్రాంతాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి. రెండు రాష్టాల సరిహద్దులో ఉండటంతో పాటు విద్యాసంస్థలు,యాత్రికులు టార్గెట్ గా గంజాయి అక్రమ దందా విపరీతంగా పెరిగింది. చివరకు తిరుమలలో సైతం గంజాయి పట్టుబడింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తిరుపతి, రేణిగుంట జంక్షన్ల అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది. పట్టుబడిన సరుకు కూడా తక్కువేమీ కాదు. దీనికితోడు పలువురు యువకుల్ని తమ కంట్రో‌ల్‌లో ఉంచుకోవడానికి వారికి గంజాయి అలవాటు చేసి.. వైసీపీ ముసుగులో ఉన్న స్మగ్లర్లు తమ దందా నడిపించారు.

- Advertisement -

నారాలోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి,చంద్రగిరి నియోజకవర్గాలలో సాగుతున్నప్పుడు చంద్రగిరి ఉన్నత పాఠశాల అవరణలో గంజాయి పట్టుపడింది. పాఠశాల ఎదురుగా ఉన్న ఓ దుకాణం దీనికి అడ్డాగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో వైసీపీ నాయకుడే ఈ దందా నిర్వహిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపైన నారాలోకేష్ విమర్శలు గుప్పించినప్పుడు.. అప్పటి ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఏకంగా లోకేష్ కు హితవు పలుకుతూ పక్తూ రాజకీయ నాయకుడిలాగా వార్నింగ్ సైతం ఇవ్వడం గమనార్హం.

Also Read: కాన్వాయ్ ఆపి.. జనం సమస్యలు విన్న పవన్ కళ్యాణ్

చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చదివే ఓ అమ్మాయిని గంజాయికి బానిసగా చేసి అమ్మాయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని అమ్మాయి తల్లి లోకేష్ కు పిర్యాదు చేయడంతో అమ్మాయికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు అనేకం జిల్లాలో జరిగాయి. మరో వైపు పెద్ద ఎత్తున గంజాయి జిల్లాలోకి దిగుమతి అవడమే కాకుండా గల్లిగల్లిలో అమ్మకాలు సాగించే టీమ్ లు తయారయ్యాయి. తిరుమలలో అయితే కొంత మంది తట్టల పేరుతో వ్యాపారాలు చేస్తున్న వారు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారంట. ఇక తిరుపతిలోని మెజార్టీ డివిజన్‌లలో అప్పట్లో వైసీపీ కార్యకర్తల మంటూ రౌడీ రాజ్యం చేసిన యువకులు.. గంజాయి విక్రయాలతోనే లక్షాధికారులయ్యారు.

విద్యా సంస్థల టార్గెట్ గా గంజాయి అమ్మకాలు సాగించారు. తెలుగు రాష్టాలలో హైదరాబాదు తర్వాత అనేక విద్యాసంస్థలు ఉన్న ప్రాంతం తిరుపతి.. యూనివర్సీటిలు ఐదు, ఉన్నత విద్యాసంస్థలు రెండు, త్రిబుల్ ఐటిలు రెండు, పాక శాస్త్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు ఐదు. పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీలు లెక్క లేదు. ఈ విధంగా సుమారు 75 వేల మంది పైగా విద్యార్థులు తిరుపతి చుట్టు పక్కల ఉంటారు. వీరిని టార్గెట్ గా చేసుకోని అమ్మకాలు సాగించారు గంజాయి స్మగ్లర్లు.. వారిని మత్తుకు బానిసలు చేయానికి కూడా గ్రూపులు ఏర్పాటు చేశారు.

Also Read: వైసీపీ భవిష్యత్‌కు ప్రమాదకరంగా జగన్ తీరు

రవాణాకు అనుకూలంగా ఉండటంతో పాటు భక్తుల ముసుగులో తిరుపతి వచ్చే అవకాశముండటం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లకు దేశం నలుమూలల నుంచి రైల్లు వస్తుండటంతో .. దాన్ని సెంటర్ పాయింట్ గా పెట్టుకుని అక్రమరవాణా జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్లు చివరకు శ్రీలంక కు కూడా గంజాయి రవాణా చేశారు. రెండు మూడు సార్లు పట్టుబడ్డారు. చెన్నై , బెంగుళూరు కు కూడా ఇక్కడి నుంచి సరఫరా జరిగిందని తెలుస్తోంది. స్థానికంగా తనిఖీలు తక్కువ కావడం రాజకీయ ప్రాభల్యం ఉండటంతో వారిని పోలీసులు ఏం చేయలేకపోయారు. దానికి తోడు నిఘా విభాగంలో సైతం తమ అనుకూలురుని ఉంచుకోవడంతో.. వారు తమ పై అధికారులకంటే రాజకీయ బాస్‌లకు ముందు సమాచారమిచ్చి తర్వాత తమ పోలీసు బాస్ లకు సమాచారం పంపేవారంట.

ఇలాంటి పరిస్థితులలో నూతన ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు వంద రోజులు టార్గెట్ గా పెట్టుకోవడంతో.. పోలీసు అధికారులు సైతం సీరియస్ గా స్పందిస్తున్నారు. తిరుపతిలో రాత్రి నిఘా పెరిగింది. దీంతో పాటు కాలేజిల వద్ద కూడా నిఘా పెంచారు. రాత్రులు గుంపులుగుంపులుగా ఉన్న బ్యాచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గతంలో రౌడీయిజం చేసిన బ్యాచ్ కౌంటింగ్ తర్వాత అజ్ణాతంలోకి వెళ్లి పోయింది. వారి కోసం పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. వారు దొరికితే వైసీపీలోని అసలు గాడ ఫాదర్ల బాగోతం బయటపడుతుందంటున్నారు. అయితే గంజాయి అమ్మకం దారుల గురించి పోలీసులకు పూర్తి సమాచారం ఉందని వారు పూర్తి గా పనిచేస్తే పదిరోజులలో అక్రమదందా దారులంతా జైళ్లలో ఉంటారని స్థానికులు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News