Big Stories

Big shock to 3 IPS officers: నిన్న ఐఏఎస్, నేడు ఐపీఎస్.. ఈ ముగ్గురు అధికారులకు ఝలక్

Big shock to 3 IPS officers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్టు రెడీ అయ్యింది. చంద్రబాబు సర్కార్ కొలువు తీరగానే మార్పులు-చేర్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ఐఏఎస్ అధికారులను ఇప్పటికే పక్కనపెట్టేసింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు ఐపీఎస్‌ల వంతైంది. జగన్ ప్రభుత్వంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు కీలక అధికారులు. తాము ఐపీఎస్ అధికారుల మన్న విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు టీడీపీ సర్కార్ వాళ్లకి ఊహించని ఝలక్ ఇచ్చింది. వాళ్లలో ప్రస్తుతానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులు. ఒకరు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మరొకరు మాజీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్, రెడ్ సాండిల్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ రిషాంత్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురించి అందరికీ తెల్సిందే. ఆయనకు టీడీపీ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది. డీజీపీగా ఉన్న సమయంలో టీడీపీ నేతలు మాట్లాడేందుకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా కనీసం స్పందించిన పాపాన పోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసేవరకు ఆయన డీజీపీ పదవిలో కొనసాగారు. ఈసారి ఏకంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేసింది.

మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రెస్‌మీట్‌ పెట్టి చాలా విషయాలు చెప్పారు. దానికి ఫిదా అయిపోయిన అప్పటి సీఎం జగన్, ఆయనను సీఐడీ విభాగానికి డీజీ పదోన్నతి కల్పించారు. ఇంకేముందు రెచ్చిపోయారు.. పాలక పక్షంతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు.

టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు అప్పటి నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజును అరెస్ట్ చేయడం, ఆపై ప్రశ్నించడపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు ఆయనను అగ్నిమాపకశాఖ డీజీగా బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ:  ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

మూడో వ్యక్తి రెడ్‌సాండిల్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ రిషాంత్‌రెడ్డి. ఈయనకు టీడీపీ సర్కార్ డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో ఈ ఐపీఎస్ అధికారిదే రాజ్యం. అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు రాళ్ల దాడి చేస్తే తూతూమంత్రంగా కేసులు పెట్టారాయన. చివరకు టీడీపీ అధినేతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారాయన. ప్రభుత్వాలు మారాయి.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తొలివిడతలో ముగ్గుర్ని మాత్రమే పక్కనపెట్టింది. సెకండ్ జాబితాలో మరికొందరు ఐపీఎస్ అధికారులున్నారు. వాళ్లని ఏజెన్సీ ప్రాంతాలకు పంపించాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News