Big Stories

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం

AP Government Spandana programme(Andhra news today): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’ కార్యక్రమాన్ని సమూలంగా మార్పులు చేస్తోంది. ఈ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ‘స్పందన’ కార్యక్రమాన్ని ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’గా పునరుద్ధరిస్తూ కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

కలెక్టర్లకు ఆదేశాలు..

- Advertisement -

‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సీఎంఓతోపాటు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

సమస్యల పరిష్కారమే..

2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌ల పరిశీలన కోసం ప్రజావేదిక నిర్మించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. తాడేపల్లి వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటూ హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తయినప్పటికీ ప్రారంభించలేదు. కేవలం స్పందన రివ్యూలతోనే జగన్ ప్రభుత్వం కాలయాపన చేసినట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా స్పందన కార్యక్రమంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం.. ససమ్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News