Big Stories

AP Government: జగన్ పథకాలకు పేర్లు మార్పు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

AP Government Changed the Names Of Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ చేపట్టిన పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలు పథకాలు పేర్లు మారాయి.

- Advertisement -

ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో గత పాలనలోని సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. మాజీ సీఎం జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. వైఎస్సార్ కల్యాణ మస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుక, జగనన్న విద్యా దీవెన పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న విదేశీ దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News